Rajeev Chandrasekhar : ఎలోన్ మస్క్ కు కేంద్ర మంత్రి సపోర్ట్
ట్రంప్ పై నిషేధం ఎత్తివేత సబబే
Rajeev Chandrasekhar : ప్రపంచ కుబేరుల్లో టాప్ వన్ లో ఉన్నారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్. ఆయన ఎవరూ ఊహించని రీతిలో కోలుకోలేని షాక్ ఇచ్చారు సోషల్ మీడియాను ఒంటి చేత్తో శాసిస్తూ వస్తున్న మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ కు $44 బిలియన్ డాలర్లకు దానిని చేజిక్కించుకున్నారు.
కాగా ట్విట్టర్ తన ఆధీనంలోకి రావాలంటే ఇంకా ఆరు నెలలు ఆగాల్సి ఉంది. ఇంత లోపు ప్రపంచాన్ని విస్తు పోయేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు.
రోజూ ఏదో ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు ఎలోన్ మస్క్. ఇప్పటికే ఎవరైనా సరే ట్విట్టర్ లో భాగస్వాములు కావచ్చని సూచించాడు.
అంతే కాదు ఇప్పుడు విధులు నిర్వహిస్తున్న సిఇఓ పరాగ్ అగర్వాల్ పై ఆయన గుర్రుగా ఉన్నారు.
అప్పుడప్పుడు సెటైర్లు వేస్తూ మరింత కవ్వింపు చర్యలకు దిగుతున్నారు ఎలోన్ మస్క్. తాజాగా ఆయన చేసిన ట్వీట్ ఒక్కసారిగా ప్రపంచాన్ని కుదిపేసింది.
అదేమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హింసకు పాల్పడేలా తన శ్రేణులను ప్రోత్సహించారంటూ ట్విట్టర్ తో సహా ఫేస్ బుక్,
ఇన్ స్టా గ్రామ్, వాట్సాప్ , యూట్యూబ్ సంస్థలు పూర్తిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాలను నిషేధించాయి.
దీంతో ఆయన వాటిపై కన్నెర్ర చేశారు. తానే వాటికి పోటీగా ట్రూత్ సోషల్ మీడియాను ఎష్టాబ్లిష్ చేశారు.
ఈ తరుణంలో ఎలోన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్నాక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సంఘ విద్రోహ శక్తులు లేదా సమాజానికి ఇబ్బంది కలిగించే ఖాతాలు, వ్యక్తుల అభిప్రాయాలను నిషేధించాలి. కానీ ఇలా ఒక దేశానికి ప్రెసిడెంట్ గా పని చేసిన వ్యక్తిపై ఇలాంటి నిషేధం పనికి రాదంటూ పేర్కొన్నారు.
తన పరిధిలోకి వచ్చాక ట్రంప్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేస్తానని ప్రకటించారు. ఇదే సమయంలో మస్క్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు భారత ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(Rajeev Chandrasekhar).
Also Read : ట్రంప్ కు ఎలోన్ మస్క్ గుడ్ న్యూస్