Rajeev Shukla : అస‌త్య హామీల‌తో క‌మ‌లం మోసం – రాజీవ్ శుక్లా

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ నేత ఫైర్

Rajeev Shukla : ఎవ‌రీ రాజీవ్ శుక్లా అనుకుంటున్నారా. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు. అంతే కాదు కోట్లాది రూపాయ‌లు క‌లిగిన భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కు వైస్ ప్రెసిడెంట్. కొన్నేళ్లుగా అందులో తిష్ట వేశారు. ఇక హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు.

ఇక్క‌డ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కేంద్ర స‌మాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ త‌న‌యుడు త‌రుణు ధుమాల్ ఐపీఎల్ చైర్మ‌న్. విచిత్రం ఏమిటంటే ఒకే సంస్థ‌లో ఉన్ప‌ప్ప‌టికీ ఇప్పుడు మాట‌ల తూటాలు పేలుస్తున్నారు. ఈ త‌రుణంలో ఆదివారం రాజీవ్ శుక్లా(Rajeev Shukla) మీడియాతో మాట్లాడారు. ప్ర‌స్తుతం హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌ల రాజ‌కీయం మ‌రింత వేడెక్కింది.

ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు రాజీవ్ శుక్లా. తాజాగా బీజేపీ త‌న మేనిఫెస్టోను విడుద‌ల చేసింది. ఇదంతా బ‌క్వాస్ అని, ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్ట‌డం త‌ప్ప చేసింది ఏమీ లేద‌ని ఎద్దేవా చేశారు రాజీవ్ శుక్లా. 2017లో విడుద‌ల చేసిన ప‌లు మేనిఫెస్టోల‌ను చూసి కాపీ కొట్టారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

గ‌తంలో లెక్క‌కు మించి హామీలు ఇచ్చార‌ని కానీ ఏ ఒక్క‌టిని నెర‌వేర్చ‌లేక పోయార‌ని పేర్కొన్నారు. మ‌రోసారి ప‌వ‌ర్ లోకి వ‌చ్చేందుకు మోసపూరిత‌మైన వాగ్ధానాలు ఇస్తున్నారంటూ ఆరోపించారు. తాము ప‌వ‌ర్ లోకి వ‌స్తే 5 ల‌క్ష‌ల మంది యువ‌త‌కు జాబ్స్ ఇస్తామ‌ని మేని ఫెస్టోలో చెప్పామ‌ని దానిని బీజేపీ కాపీ కొట్టిందంటూ ఆరోపించారు.

ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి అల్కా లాంబా సైతం ఫైర్ అయ్యారు.

Also Read : భ‌గ‌త్ సింగ్ ఎయిర్ పోర్ట్ గా పేరు మార్పు

Leave A Reply

Your Email Id will not be published!