KTR : తెలంగాణలో రాజేశ్ ఎక్స్పోర్ట్స్ భారీ పెట్టుబడి
ప్రకటించిన ఐటీ , పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్
KTR : ప్రముఖ కంపెనీలన్నీ ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే దేశంలో ఐటీ, ఫార్మా, అగ్రి హబ్ లకు కేరాఫ్ మారింది ఈ నగరం. దిగ్గజ కంపెనీన్నీ ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి.
రాష్ట్రంలో కొలువు తీరిన ప్రభుత్వం పారిశ్రామికవేత్తలు, బడా వ్యాపారవేత్తలకు ఎర్ర తివాచీ పరుస్తోంది. ప్రధానంగా పెట్టుబడులు పెట్టాలని అనుకునేవారికి మౌలిక వసతులు కల్పిస్తోంది.
కేవలం 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇచ్చేలా ప్రత్యేకంగా టీఎస్ ఐఎస్ పాలసీని తీసుకు వచ్చింది. తాజాగా భారీ పెట్టుబడులు పెట్టనుంది రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ .
ఈ విషయాన్ని స్వయంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) వెల్లడించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్ల డిస్ ప్లేలను తయారు చేసే సంస్థ అమోలెడ్ భారత్ లో అతి పెద్ద ఇండస్ట్రీని హైదరాబాద్ లో ఏర్పాటు చేసేందుకు ఓకే చెప్పిందని తెలిపారు కేటీఆర్.
రాజేశ్ ఎక్స్ పోర్ట్స్ (ఎలెస్ట్ ) అమోలెడ్ డిస్ ప్లే ఫ్యాబ్రికేషన్ తయారీ యూనిట్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తుందన్నారు. ఇందుకు గాను ఏకంగా రూ. 24,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ ఏడాది ఒక కంపెనీ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేయడం మొదటిసారి కావడం విశేషం. ఇప్పటి దాకా జపాన్, కొరియా, తైవాన్ దేశాలకు సాధ్యమైన ఫీట్ ఇకపై ఇండియాలోనూ చోటు చేసుకోనుందని తెలిపారు కేటీఆర్(KTR).
సంస్థ చైర్మన్ , రాష్ట్ర కార్యదర్శి జయేశ్ రంజన్ సంతకాలు చేశారు బెంగళూరులో.
Also Read : తెలంగాణకు ఏం చేసినవో చెప్పు – బండి