Rajiv Chndrasekhar : ట్విట్ట‌ర్ పై మా స్టాండ్ మార‌దు : చంద్ర‌శేఖ‌ర్

ఎలోన్ మ‌స్క్ కు ప్ర‌త్యేక అభినంద‌న‌లు

Rajiv Chndrasekhar  :ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక‌టే చ‌ర్చ‌. సోష‌ల్ మీడియా దిగ్గ‌జంగా పేరొందిన ట్విట్ట‌ర్ ను ప్ర‌పంచ కుబేరుడు టెస్లా సిఇఓ, చైర్మ‌న్ ఎలోన్ మ‌స్క్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తోంది.

కొంద‌రు ట్విట్ట‌ర్ గ‌తంలో లాగా ఉంటుందా అని అంటే ఇంకొంద‌రు ఫ‌క్తు వ్యాపారంగా మార‌బోతోందంటు కామెంట్ చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా ట్విట్ట‌ర్ కు సిఇఓగా మ‌న భార‌తీయుడే ఉండ‌డం విశేషం.

ప‌రాగ్ అగ‌ర్వాల్ ఇవాళ ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం నెల‌కొన్న అనిశ్చితి కొంత కాలం పాటు ఉండేందుకు అవ‌కాశం ఉంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా ఎలోన్ మ‌స్క్ టేకోవ‌ర్ చేసుకోవ‌డాన్ని చాలా మంది ఉద్యోగ‌స్తులు, ట్విట్ట‌ర్ అభిమానులు జీర్ణించు కోలేక పోతున్నారు. ఈ త‌రుణంలో కేంద్ర ఎల‌క్ట్రానిక్స్ , ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ శాఖ స‌హాయ మంత్రి రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్(Rajiv Chndrasekhar )స్పందించారు.

ట్విట్ట‌ర్ ప‌ట్ల భార‌త్ త‌న వైఖ‌రిలో ఎలాంటి మార్పు ఉండబోద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ ల‌క్ష్యాలు, అంచ‌నాలు ఎప్ప‌టి లాగే ఉంటాయ‌న్నారు. కాగా ప్ర‌పంచంలో అత్య‌ధిక స‌బ్ స్క్రైబ‌ర్లు క‌లిగిన ఏకైక దేశం భార‌త దేశం.

ఇక్క‌డి నుంచే ఎక్కువ‌గా ట్విట్ట‌ర్ ను వాడుతున్నారు. ట్విట్ట‌ర్ ను చేజిక్కించుకున్న ఎలోన్ మ‌స్క్ కు అభినంద‌న‌లు తెలియ చేస్తున్న‌ట్లు పేర్కొన్నారు రాజీవ్ చంద్ర‌శేఖ‌ర్.

జ‌వాబుదారీత‌నం, భ‌ద్ర‌త‌, విశ్వాసం , ల‌క్ష్యాలు, అంచ‌నాలు ఎప్ప‌టికీ మార‌వ‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. ఒకానొక ద‌శ‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇండియా అన్న రీతిలో పోరు కొన‌సాగింది.

ట్విట్ట‌ర్ ప‌నిగ‌ట్టుకుని భార‌త్ కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం చేస్తోందంటూ మోదీ స‌ర్కార్ ఆరోపించింది.

Also Read : అనిశ్చితి కాలం ప్ర‌వేశిస్తోంది – సిఇఓ

Leave A Reply

Your Email Id will not be published!