Rajnath Singh: త్రివిధ దళాధిపతులు సహా సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ
త్రివిధ దళాధిపతులు సహా సీడీఎస్‌తో రాజ్‌నాథ్ సింగ్ కీలక భేటీ
Rajnath Singh : భారత్ పాకిస్తాన్ సరిహద్దు యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్(Rajnath Singh) మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సీడీఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ పై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన కొన్ని గంటల్లోనే ఈ సమావేశం జరగడం విశేషం. భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
Rajnath Singh – పాక్ డోన్లను దాడులను తిప్పికొట్టిన సైన్యం
గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత మిలటరీ సంస్థలు, విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకుని వెస్ట్రన్ బోర్డర్ వెంబడి పాక్ సాయుధ బలగాలు డ్రోన్ దాడులతో విరుచుకుపడ్డాయి. అయితే ఈ దాడులను భారత్ బలగాలు దీటుగా తిప్పికొట్టాయి. ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పెద్ద సంఖ్యలో పాక్ డ్రోన్లను బలగాలు కుప్పకూల్చాయి. భారత సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించేందుకు భారత ఆర్మీ కట్టుబడి ఉందని, పాక్ కుట్రలను తిప్పికొడతామని సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆర్మీ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి ఉదంపూర్, సాంబ, జమ్మూ, అక్నూర్, నగ్రోటా, పఠాన్‌కోఠ్ ప్రాంతాల్లో 50కి పైగా పాక్ డ్రోన్లను విజయవంతంగా కుప్పకూల్చివేసినట్టు మీడియాకు తెలిపింది.
గురువారం రాత్రి పాకిస్తాన్ కు చెందిన భద్రతా దళాలు… జమ్మూ, పఠాన్ కోట్, ఉధమ్‌పుర్ సైనిక స్థావరాలపై దాడికి తీవ్రంగా ప్రయత్నించాచి. అయితే భారత సైన్యం వీటిని సమర్ధవంతంగా అడ్డుకుందిది. అంతేకాదు భారత్ నియంత్రణ రేఖకు సమీపంలోని పాక్ సైనిక పోస్టులను భారత్ ధ్వంసం చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా… భారత్ మే 7వ తేదీన ఆపరేషన్ సిందూర్ పేరుతో పాక్‌లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను ధ్వసం చేసింది. దాదాపు 100 మంది ఉగ్రవాదులు ఈ దాడుల్లో మృతి చెందారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు నిన్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.
Also Read : PM Narendra Modi: గుజరాత్ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్ ! సరిహద్దుల్లో భద్రత సన్నద్ధతపై ఆరా !
