Rajya Sabha Polls : రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో ‘రాజులు’ ఎవ‌రో

41 ఎంపీ సీట్లు ఏక‌గ్రీవం 16 సీట్ల‌కు ఎన్నిక‌లు

Rajya Sabha Polls : దేశ వ్యాప్తంగా 16 రాజ్య‌స‌భ(Rajya Sabha Polls) ఎంపీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాల‌లో 57 ఎంపీ సీట్ల‌కు ఖాళీలు ఏర్ప‌డ్డాయి. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది.

ఈ మొత్తం స్థానాల‌కు సంబంధించి 41 మంది స‌భ్యులు ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. దీంతో 16 ఎంపీ సీట్ల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అతిర‌థ మ‌హార‌థులు ఈ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్నారు.

వారిలో ప్ర‌ధానంగా చెప్పు కోవాల్సింది ఇండియా మీడియా బ్యారెన్ గా పేరొందిన ఎస్సెల్ (జీ గ్రూపు ) గ్రూప్ చైర్మ‌న్ సుభాష్ చంద్ర రాజ‌స్థాన్

నుంచి పోటీలో ఉండ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది.

ఇక మొత్తం ప‌ద‌హారు స్థానాల‌కు గాను ఒక్క మ‌హారాష్ట్ర నుంచే 6 సీట్ల‌కు పోటీ కొన‌సాగుతోంది. విచిత్రం ఏమిటంటే నిన్న‌టి దాకా ఉప్పు నిప్పుగా

ఉన్న ఎంఐఎం విచిత్రంగా బీజేపీని ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంది.

ఈ మేర‌కు శివ‌సేన నేతృత్వంలోని సంకీర్ణ స‌ర్కార్ మ‌హా వికాస్ అఘాడీ అభ్య‌ర్థిగా బ‌రిలో ఉన్న కాంగ్రెస్ అభ్య‌ర్థికి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని పిలుపునిచ్చింది.

ఇందుకు సంబంధించి ఎంఐఎం ఎంపీ జ‌లీల్ త‌న అధికారిక ట్విట్ట‌ర్ వేదిక‌గా పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం దేశ రాజ‌కీయాల‌లో ప్ర‌కంప‌న‌లు రేపుతోంది

ఈ ట్వీట్. ప్ర‌స్తుతం త‌మ భ‌విత‌వ్యాన్ని నిరూపించుకునే వారిలో ప్ర‌ముఖులు ఉన్నారు.

వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్, పీయూష్ గోయ‌ల్ , ర‌ణ్ దీప్ సూర్జే వాలా, జైరాం ర‌మేష్ , ముకుల్ వాస్నిక్ , సంజ‌య్ రౌత్

పోటీ చేస్తున్నారు.

వీరిలో నిర్మ‌లా, గోయ‌ల్ , సంజ‌య్ రౌత్ కీల‌క‌మైన వ్య‌క్తులుగా ఉన్నారు. ఇక మిగిలిన 16 స్థానాల‌కు సంబంధించి హ‌ర్యానా, రాజ‌స్థాన్ , మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క రాష్ట్రాల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి. ఈ మొత్తం ఎన్నిక‌ల(Rajya Sabha Polls) ప్ర‌క్రియ‌ను వీడియో తీయాల‌ని సీఈసీ రాజ‌వ్ కుమార్ ఆదేశించారు.

Also Read : శివ‌సేన కూట‌మికి ఎంఐఎం స‌పోర్ట్

Leave A Reply

Your Email Id will not be published!