Rakesh Reddy Anugula : బీజేపీకి బిగ్ షాక్
రాకేష్ రెడ్డిని కలిసిన కడియం
Rakesh Reddy Anugula : వరంగల్ పశ్చిమ – తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న ప్రస్తుత తరుణంలో భారతీయ జనతా పార్టీకి కోలుకోలేని షాక్ తగిలింది. కొన్నేళ్ల పాటు క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా, ప్రజల గొంతును వినిపిస్తూ వచ్చిన ఏనుగుల రాకేష్ రెడ్డి ఆ పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు.
Rakesh Reddy Anugula Comment Viral
ఈ మేరకు ఆయన కీలక ప్రకటన చేశారు. తాను నిబద్దతతో పార్టీ కోసం పని చేశానని కానీ పార్టీ తన సేవలను వాడుకుని వదిలి వేసిందని ఆరోపించారు. కొందరు కావాలని తనను తొక్కి పెట్టాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీలో యువతకు ఆదరణ లేకుండా పోయిందని ఆరోపించారు ఏనుగుల రాకేష్ రెడ్డి(Rakesh Reddy Anugula). ఆయన ఈసారి ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి తనకు టికెట్ వస్తుందని ఆశించారు. మూడు సర్వేలలో కూడా తన పేరు ముందంజలో ఉందన్నారు.
కానీ బీజేపీకి చెందిన కొందరు నేతలే తనను కావాలని పక్కన పెట్టేలా చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాకేష్ రెడ్డికి బలమైన కేడర్ తో పాటు అనుచర వర్గం ఉంది. 10 ఏళ్లకు పైగా తను పార్టీకి సేవలు అందించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. దీంతో ఆయన కంటతడి పెట్టారు.
ఇదిలా ఉండగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి రాకేష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. నిబద్దత కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారని ఆయన సేవలు ప్రజలకు, పార్టీకి అవసరమని పేర్కొన్నారు.
Also Read : BRS WIN : దొర పాలనకే మళ్లీ పట్టం