Rakesh Tikait : కేంద్ర స‌ర్కార్ పై టికాయత్ క‌న్నెర్ర‌

కేంద్ర ఆర్థిక మంత్రిపై ఆగ్ర‌హం

Rakesh Tikait :  భార‌తీయ కిసాన్ సంఘ్, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయ‌కుడు రాకేశ్ టికాయ‌త్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆయ‌న గురువారం ట్విట్ట‌ర్ వేదిక‌గా నిప్పులు చెరిగారు.

ప్ర‌పంచంలో చోటు చేసుకున్న ద్ర‌వ్యోల్బ‌ణం దేశంలోని పేద‌ల‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌దంటూ దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ పేర్కొన‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

విచిత్రం ఏమిటంటే ఆక‌లితో అల‌మ‌టిస్తున్న 107 దేశాల్లో భార‌త్ 94వ ర్యాంక్ నుంచి 101వ ర్యాంకుకు ప‌డింద‌ని తెలిపారు. ఈ విష‌యం తెలుసు కోకుండా నిర్మ‌లా సీతారామ‌న్ ఎలా మాట్లాడ‌తారంటూ ప్ర‌శ్నించారు టికాయ‌త్(Rakesh Tikait).

జీఎస్టీ వ‌ల్ల పిండి బియ్యం ధ‌ర మోయ‌లేనంత‌గా త‌యారైంద‌ని, దీనిపై ఆధార‌ప‌డి ఉన్న వారు కోట్ల‌ల్లో ఉన్నార‌న్న సంగ‌తి గుర్తించాల‌ని స్ప‌ష్టం చేశారు రైతు నాయ‌కుడు.

ఈ దేశంలో వ్యాపార‌వేత్త‌లు, కార్పొరేట్ కంపెనీలు మ‌రింత బ‌లంగా త‌యార‌వుతున్నార‌ని, కానీ పంట‌లు పండించి దేశానికి అన్నం పెట్టే రైతుల ప‌రిస్థితుల్లో ఎలాంటి మార్పులు రావ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు రాకేశ్ టికాయ‌త్(Rakesh Tikait).

ఒక ర‌కంగా కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా క‌క్ష గ‌ట్టింద‌ని ఆరోపించారు. రైతుల‌ను మోసం చేసింద‌ని మండిప‌డ్డారు. పండించిన పంట‌ల‌కు క‌నీస మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కోరామ‌ని కానీ ఈరోజు వ‌ర‌కు మోదీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు రాకేశ్ టికాయ‌త్.

బ‌డా బాబుల‌కు మేలు చేకూర్చేలా కేంద్రం ప‌ని చేస్తోంద‌ని దీని వ‌ల్ల పేద‌లు, రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు టికాయ‌త్.

Also Read : ఎస్బీఐ త‌ప్ప అన్నీ ప్రైవేట్ ప‌రం

Leave A Reply

Your Email Id will not be published!