Rakesh Tikait : మోదీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, రైతు అగ్ర నేత రాకేశ్ తికాయత్(Rakesh Tikait ). సాగు చట్టాలు రద్దు చేసినా ఈరోజు వరకు తాము కోరిన డిమాండ్లలో ఒక్కటి కూడా పరిష్కారం కాలేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇవాళ ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు రాకేశ్ తికాయత్(Rakesh Tikait ). కొంత కాలం వేచి చూస్తామని కానీ ఇక నుంచి మళ్లీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
దేశంలో 70 శాతనికి పైగా వ్యవసాయంపై ఆధరాపడి ఉన్నారని కానీ ప్రభుత్వం ముగ్గురు నలుగురు బడా వ్యాపారవేత్తల కోసం , కార్పొరేట్ కంపెనీల కోసం పని చేస్తోందని మండిపడ్డారు.
ఒక రకంగా తనకు దేశంలో ప్రభుత్వం ఉందని అనిపించడం లేదన్నారు. కేంద్ర సర్కార్ ను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఆయన అభివర్ణించారు.
మినిమం సపోర్ట్ ప్రైజ్ – కనీస మద్దతు ధర కోసం రైతులు డిమాండ్ చేస్తున్నారని, ఇది న్యాయపరమైనదని తాము నమ్ముతున్నామని స్పష్టం చేశారు.
కానీ సర్కార్ కు సోయి లేకుండా పోయిందన్నారు. ఇదిలా ఉండగా వ్యవసాయ మంత్రిత్వ శాఖ రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయలేక పోయిందని, చాలా రాష్ట్రాలలో ఆదాయం గణనీయంగా తగ్గిందని పార్లమెంట్ కమిటీ అంగీకరించిన విషయాన్ని తికాయత్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.
ఎంఎస్పీ గ్యారెంటీ చట్టం చేయనంత కాలం రైతులను దోచుకుంటూనే ఉంటారని సీరియస్ అయ్యారు. రైతుల హక్కుల కోసం పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని హెచ్చరించారు రాకేశ్ తికాయత్.
Also Read : 52 మందితో యూపీ కేబినెట్