Rakesh Tikait : భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి, సంయుక్త కిసాన్ మోర్చా అగ్ర నాయకుడు రాకేశ్ తికాయత్(Rakesh Tikait )సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
రాను రాను వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తోందంటూ ఆరోపించారు. చట్టాలు వెనక్కి తీసుకున్నా, రద్దు చేసినా ఈరోజు వరకు రైతులపై నమోదు చేసిన కేసులు మాఫీ చేయలేదని వాపోయారు.
ఇప్పటి దాకా ఇంకా జైళ్లల్లో ఉన్న వారిని విడుదల చేయలేదన్నారు. రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించేందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు.
ఇలాగే తాత్సారం చేస్తూ పోతే మరోసారి దేశ వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందన్నారు. తాజాగా రాకేశ్ తికాయత్ (Rakesh Tikait ) ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.
వ్యవసాయానికి సంబంధించి రైతుల కోసం మాఫీ చేసిన రుణాలు ఎలాంటి మార్పు తీసుకు రాలేక పోతోందని ఆవేదన చెందారు. ఇదే విషయాన్ని నాబార్డ్ నివేదిక స్పష్టం చేసిందని వెల్లడించారు. రాకేశ్ తికాయత్.
ప్రస్తుతం సంక్షోభంలో వ్యవసాయ రంగం ఉందన్నారు. గత 3 సంవత్సరాలలో 1.1 కోట్ల మందికి మాత్రమే ఉపాధి కల్పించిందన్నారు. సీఎంఐఈ అమలు చేస్తున్నా అగ్రికల్చర్ సెక్టార్ ఇంకా నష్టాల్లోనే ఉండడం బాధాకరమని పేర్కొన్నారు.
ఈ నివేదికల ద్వారానైనా కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చు కోవాలని, ఇప్పటికైనా రైతుల కోసం పని చేయాలని సూచించారు. లేక పోతే మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు రాకేశ్ తికాయత్.
Also Read : పీఎస్ఐ కుంభకోణం శివకుమార్ ఆగ్రహం