#RameshRajaa: ర‌మేష్ రాజా కళా సౌరభం చిత్ర రాజసం

క‌ళాత్మ‌కు ద‌ర్ప‌ణం ఈ చిత్రాలు

Ramesh Rajaa: కళ అజరామరం. అదో అంతుపట్టని సన్నివేశం. కదిలే ప్రపంచాన్ని, లోలోపటి అంతరంగాన్ని ఆవిష్కరించే ఉపకారణాలల్లో ఏదైనా అగ్రభాగాన ఉంది అంటే అది ఒక్కటే ఆర్ట్. ప్రతి నిత్యం ప్రవాహమై, సంచారమై అల్లకల్లోలాను రేపే ప్రతి సన్నివేశాన్ని భద్ర పరుచు కునే లాకర్ లాంటిది ఈ కళ. ఈ అందమైన లోకాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఆవిష్కరించలేం. జీవితం చిన్నది. అది ఆశ పెడుతుంది. పరుగులు పెట్టిస్తుంది. ఒక చోట ఉండనీయదు..ఇంకో చోటుకు వెళ్లనీయదు. అందుకే ప్రతి ఒక్కరు ప్రయాణాన్ని ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలు..కొత్త దారులు..కొత్త అడుగులు..ఇంతలా మానవ సమూహాన్ని కొన్ని దశాబ్దాలుగా..కొన్ని తరాల నుంచి ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. ఉంటాయి కూడా..దీనికి ప్రారంభమే తప్పా అంతం అంటూ లేనే లేదు.

ఏ చరిత్రను కదిలించినా లెక్కలేనన్ని గాయాలు..మరిచి పోలేని జ్ఞాపకాలు నిక్షిప్తమై ఉన్నాయి. కానీ శరవేగంగా టెక్నాలజీ మారినా సాహిత్యం, కళా సౌరభాలు మారలేదు. ఉప్పెనలా మరింత ముందుకు వెళుతూనే ఉన్నాయి. జీవిన గీతికను గేయంగా కళాకారులు ఆలాపిస్తూ వుంటే ఇంకొందరు చిత్రకారులు నిద్రలేని రాత్రుల్లో తమను తాము ఆవిష్కారించుకునే యజ్ఞంలో నిమగ్నమై పోయారు. ఇది నిరంతరం సాగే ప్రక్రియ. అలాంటి ఆర్ట్ ను బతుకు కంటే ఎక్కువగా, ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ అదే లోకంగా భావించే ఆర్టిస్టులల్లో అగ్ర భాగాన కొనసాగుతున్నాడు..పాలమూరు జిల్లా కొత్తకోటకు చెందిన విశ్వనాథ రమేష్ రాజా ఆచారి(Ramesh Rajaa). తెలుగు లోగిళ్లలో ఎక్కువగా ప్రతిభా నైపుణ్యం తో పాటు కళాత్మకమైన సృజనాత్మకత విశ్వబ్రాహ్మణులకే ఎక్కువగా ఉంటుంది. ఇది చరిత్ర చెప్పిన సత్యం..వాస్తవం కూడా.

సామాజిక సంస్కర్త శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే ఈ కళాకారుడికి ప్రాణం. అలాగే తిరుమల కొండపై వెలసిన శ్రీనివాసుడంటే ఇష్టం. నిత్యం దైవసన్నిధిలో ఉండాలని పరితపించే రమేష్ కు చిన్నప్పటి నుంచే సాహిత్యం అన్నా, కళారంగాలంటే అభిమానం. అదే ఇప్పుడు ప్రవృత్తిగా మారి పోయింది. లెక్కలేనన్ని రంగులు..లెక్కించలేనన్ని బొమ్మలు..మనసు దోచుకునే అరుదైన బొమ్మలు, గుండెల్ని మీటే కళాకృతులు తన గదిలో నిక్షిప్తమై ఉన్నాయి. కొన్ని ఏళ్లుగా కుంచెలతోనే అలుపెరుగకుండా సంచారం చేస్తూ సాగి పోతున్నాడు. వృత్తి రీత్యా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ టీచర్ గా పని చేస్తూనే సమయం చిక్కినప్పుడల్లా కుంచెలతో ఆటలాడుకుంటూ రంగుల హరివిల్లులకు జీవం పోస్తున్నాడు. పెయింటింగ్ అన్నది ఎవరో చెబితే రాదు..పోనీ ప్రయత్నం చేస్తే వస్తుందని అనుకుంటే పొరపాటు పడినట్లే. కానీ అది పుట్టుకతో రావాలి అంటాడు ఈ ఆర్టిస్ట్(Ramesh Rajaa).

మనం చూసే దృష్టిని బట్టి మనకు ఒక్కో దృశ్యం ఒక్కోలాగా అగుపిస్తుంది..కానీ ఆర్టిస్టులు చూసే చూపు వేరుగా ఉంటుంది. ఈ ప్రపంచం ఇంకా ఇలా సాగుతూ ఉందంటే కారణం సాహిత్య, కళా రంగాలు వర్ధిల్లుతూ ఉండటమే. పర్యావరణాన్ని కాపాడు కోవడం అన్నది ప్రతి ఒక్కరి బాధ్యత. ప్రకృతి ఎన్నో ఇచ్చింది ..దానిలో గడపడం అంటే కొత్త లోకంలోకి ప్రవేశించడమే. కొన్నేళ్ల కిందట చిత్రాలకు, వాటిని గీసే వాళ్లకు ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు అంతా స్పీడ్. మన దగ్గర మాత్రమే ఈ జాడ్యం ఉంది..కానీ ఇతర దేశాల్లో అలా కాదు. ఆర్టిస్టులకు ఎనలేని గౌరవం ఉంటుంది. అక్కడి వారంతా కళాకారులను కళ్ళకు అద్దుకుంటారు. వారితో సమావేశమై వారి అనుభవాలను పంచుకుంటారు. ఇలాంటి సాంప్రదాయం అనాదిగా వస్తూనే ఉన్నది. ఇక్కడ అలాంటిది లేదు.

అయినా మాలాంటి కళాకారులు మాత్రం సామాజిక భాద్యతగా భావిస్తూనే బతుకును..ప్రపంచాన్ని..కొత్త కోణంలో చిత్రాల ద్వారా తెలియ పరిచే పనిలో నిమగ్నమై ఉన్నామంటున్నాడు రమేష్ రాజా(Ramesh Rajaa). చేతిలో కుంచె ఉండాల్సిన పనిలేదు మనోడికి..కేవలం పెన్సిల్ చేతిలో వుంటే చాలు క్షణాల్లో కొత్త చిత్రం ప్రాణం పోసుకుంటుంది. ఏ ఫార్మాట్ లోనైనా గీసే నైపుణ్యం ఇతడి సొంతం. అంతే కాదు సుద్ద ముక్క వుంటే చాలు వింతలన్నీ రూపు దిద్దుకుంటాయి. చూస్తే చిన్ని సీసాలు..కనీసం పట్టుకుందామంటే చేతుల్లో ఇముడవు..కానీ రమేష్ మాత్రం వేలు దూరని ఆ సీసాల్లో ఏడు వింతలకు ప్రాణం పోశాడు. ఇదంతా ఆర్ట్ మీదున్న ప్రేమ..కసి..కష్టపడితే..కాష్ఠంతా భిన్నంగా ఆలోచిస్తే..దానికి క్రియేటివిటీ జోడిస్తే ఇలాంటివి ఎన్నో చేయొచ్చంటాడు ఈ కళాకారుడు.

అందుకే ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్(Ramesh Rajaa) లలో చోటు దక్కించుకున్నారు. ఎన్నో ప్రదర్శనలు..మరెన్నో అవార్డులు..సన్మానాలు
అందుకున్నాడు.సంగీతం..సాహిత్యం..దైవం..యోగా..సంచారం..ఫోటోగ్రఫి..టెక్నాలజీ..డిజైనింగ్..లలో అపారమైన అనుభవం ఉన్నది. గది నిండా పుస్తకాలే కాదు..మనసు దోచుకునే ..మైమరచి పోయే..కళ్ళు చెమర్చేలా..జిగేల్ మనిపించేలా పెయింటింగ్స్ కూడా మనల్ని పలకరిస్తాయి. రా రమ్మంటూ పిలుస్తాయి. రమేష్ భావుకుడు..అంతకంటే భక్తుడు..అద్భుతమైన ఆర్టిస్ట్ కూడా. కాదనలేం కేవలం అతడితో మనమూ ప్రయాణం చేస్తూ పోవడమే. జగత్ గురువులుగా భావించే శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామీజీ, దత్త పీఠాధిపతి ఆశీస్సులు అందుకున్న రమేష్ జన్మ ధన్యం కదూ.

No comment allowed please