Randeep Surjewala : రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ రోడ్ మ్యాప్ సిద్దం చేసింది. ఈ మేరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గాను కాంగ్రెస్ సాధికార కార్యాచరణ బృందం ఏర్పాటు చేసిందన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రణ్ దీప్ సింగ్ సూర్జేవాలా(Randeep Surjewala ). .
పార్టీ కీలక సమావేశం తర్వాత ఆ పార్టీ వెల్లడించారు. వచ్చే మే 13, 14 తేదీల్లో రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో 400 మంది తో నవ సంకల్ప్ చింతన్ శిబిర్ జరుగుతుందన్నారు.
దీనిని నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు సూర్జేవాలా. రాబోయే సార్వత్రిక ఎన్నికలకు ముందు దానిని పునరుద్దరించాలనే ప్రతిపాదనను ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించారని చెప్పారు.
ఇందుకు గాను మరింత చర్చించేందుకు పార్టీ కీలక సమావేశం తర్వాత కాంగ్రెస్ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ 2024 కోసం సాధికార కార్యాచరణ బృందంను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా పార్టీలో ప్రశాంత్ కిషోర్ ఏ పాత్ర నిర్వహిస్తారనే దానిపై రణ్ దీప్ సూర్జేవాలా(Randeep Surjewala )చెప్పకుండా దాటవేశారు. సోనియా గాంధీ 10 జన్ పథ్ నివాసంలో ఇవాళ కీలక సమావేశం జరిగింది.
అనంతరం రణ్ దీప్ సింగ్ సూర్జే వాలా మీడియాతో మాట్లాడారు. ఈనెల 21న సోనియా గాంధీ ఏర్పాటు చేసిన 8 మంది సభ్యుల టీం నుంచి పార్టీ అధ్యక్షుడికి నివేదిక అందిందని తెలిపారు.
నివేదికపై మేడం చర్చించారు. రాబోయే రాజకీయ సవాళ్లను పరిష్కరించేందుకు సాధికారత యాక్షన్ గ్రూప్ 2024 ఏర్పాటు చేయాలని నిర్ణయించారని తెలిపారు.
Also Read : సిలబస్ మార్పుపై రాహుల్ సీరియస్