Randeep Surjewala : కార్పొరేట్లకు అందలం పథకాలకు మంగళం
నరేంద్ర మోదీ సర్కార్ పై కాంగ్రెస్ ఆగ్రహం
Randeep Surjewala : కాంగ్రెస్ పార్టీ కన్నెర్ర చేసింది. మోదీ ప్రభుత్వం ప్రజల కోసం పని చేయడం లేదని ఆరోపించింది. ఫక్తు వ్యాపారవేత్తలకు, ఆర్థిక నేరగాళ్లకు, కార్పొరేట్లకు లబ్ది చేకూర్చేలా ప్రయత్నం చేస్తోందంటూ మండిపడింది.
గత ఎన్నికల్లో సాక్షాత్తు ప్రధాని ప్రతి పేదలకు చెందిన ఖాతాలో రూ. 15 లక్షలు వేస్తానని చెప్పారని ఈరోజు వరకు ఒక్క రూపాయి కూడా జమ కాలేదన్నారు. దీనికి ప్రధాన మంత్రి ఏం సమాధానం చెబుతారంటూ ప్రశ్నించారు.
రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతూ , మోసం చేస్తూ బడా వ్యాపారవేత్తలైన ఇద్దరు లేదా నలుగురి కోసం పని చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఆపార్టీ సీనియర్ నేత రణ్ దీప్ సూర్జే వాలా(Randeep Surjewala).
ఆయన కాషాయ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫక్తు మతం పేరుతో రాజకీయాలు చేస్తూ మనుషుల మధ్య చిచ్చు పెడుతూ పబ్బం గడుపుతున్నారంటూ మండిపడ్డారు.
రూ. 10 లక్షల కోట్ల మొండి బకాయిలను ఎందుకు మాఫీ చేశారో దేశ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహల్ చోక్సీ , ఇతర ఆర్థిక నేరగాళ్లను ఇప్పటి వరకు దేశానికి ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు రణ్ దీప్ సూర్జే వాలా.
ప్రభుత్వ బ్యాంకులకు టోపీ పెట్టి పారి పోయిన వీరు నేరస్తులుగా అనిపించ లేదా అన్నారు. వీళ్లకు మాఫీ ఎందుకు చేశారో సిగ్గుందా అంటూ నిలదీశారు. దేశంలో ప్రభుత్వం అన్నది లేదని అది ఓ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారి పోయిందన్నారు.
Also Read : రాబోయే రోజుల్లో మరికొందరికి షాక్