Ranil Wickramasinghe : శ్రీ‌లంక అధ్య‌క్షుడిగా విక్ర‌మ‌సింఘే

గోట‌బ‌య రాజ‌ప‌క్సే స్థానంలో రణిలేకే ప‌గ్గాలు

Ranil Wickramasinghe : అంతా ఊహించిన‌ట్లుగానే జ‌రిగింది. శ్రీ‌లంక సంక్షోభం నుంచి గ‌ట్టెక్కించేందుకు గాను శ‌త‌విధాలుగా ప్ర‌య‌త్నాలు చేస్తున్న ర‌ణిల్ విక్ర‌మ‌సింఘే చివ‌ర‌కు ప్ర‌ధాన మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

గోట‌బ‌య పారి పోయాక రాజీనామా స‌మ‌ర్పించ‌డంలో పార్ల‌మెంట్ స్పీక‌ర్ తాత్కాలిక అధ్య‌క్షుడిగా ర‌ణిలే విక్ర‌మ సింఘేను ఆహ్వానించారు.

శ్రీ‌లంక రాజ్యాంగం ప్ర‌కారం ఒక‌వేళ అధ్య‌క్షుడు, ప్ర‌ధాన మంత్రి ఇద్ద‌రూ రాజీనామా చేసిన ప‌క్షంలో స్పీక‌ర్ రాష్ట్ర‌ప‌తిగా వ్య‌వ‌హ‌రిస్తారు. బుధ‌వారం ఎంతో ఉత్కంఠ‌కు తెర లేపిన శ్రీ‌లంక అధ్య‌క్షుడి ఎన్నిక ప్ర‌శాంతంగా జ‌రిగింది.

అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మాజీ ప్ర‌ధాన మంత్రి ర‌ణిల్ విక్ర‌మ సింఘే(Ranil Wickramasinghe) నూత‌న అధ్య‌క్షుడిగా ఎన్నిక‌య్యారు. ఆయ‌న శ్రీ‌లంక‌కు 8వ దేశ అధ్య‌క్షుడు కావ‌డం విశేషం.

ఈ రోజు జ‌రిగిన ఓటింగ్ లో మొత్తం పార్ల‌మెంట్ లో 225 స‌భ్యుల బ‌లం ఉంది. ఎక్కువ మంది స‌భ్యులు గోట‌బ‌య రాజ‌ప‌క్సే కు మ‌ద్ద‌తు తెలుపుతున్న వారే కావ‌డం విశేషం.

అయితే గోట‌బ‌య రాజీనామా చేసినా త‌న మ‌నిషిగా భావించే ర‌ణిల్ విక్ర‌మ సింఘేను ఉండాల‌ని కోరడం ప్ర‌జ‌ల ఆగ్ర‌హానికి దారి తీసింది.

ఈ అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో ర‌ణిల్ విక్రమ సింఘేకు మ‌ద్ద‌తుగా 134 ఓట్లు వ‌చ్చాయి. బ‌రిలో ఉన్న అల‌హా పెరుమాకు 82 ఓట్లు పోల్ అయ్యాయి.

మ‌రో అభ్య‌ర్థి అను రాకుమార‌కు 3 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. మొత్తం పోలైన ఓట్లు మాత్రం 219 మాత్ర‌మే. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం కొత్త అధ్య‌క్షుడిగా ఎన్నికైన ర‌ణిల్ విక్ర‌మ సింఘే ఆ దేశానికి ఆరుసార్లు ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేశారు.

Also Read : శ‌క్తివంత‌మైన పాస్ పోర్ట్ ల‌లో జపాన్ టాప్

Leave A Reply

Your Email Id will not be published!