Rape in Hyderabad: జర్మనీ యువతిపై హైదరాబాద్‌లో అత్యాచారం
జర్మనీ యువతిపై హైదరాబాద్‌లో అత్యాచారం
Hyderabad : హైదరాబాద్ నగరంలోని పహాడీషరీఫ్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. తన స్నేహితుడిని కలిసేందుకు జర్మనీ నుంచి వచ్చిన ఓ యువతిపై కారు డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
Foreigner Rape in Hyderabad
హైదరాబాద్ కు చెందిన యువకుడు జర్మనీలో చదువుకున్నాడు. అతడిని కలిసేందుకు వారం రోజుల క్రితం జర్మనీకి చెందిన యువతి హైదరాబాద్ వచ్చింది. సోమవారం స్నేహితులతో కలిసి ఇక్కడ పలు ప్రాంతాలు సందర్శించింది. స్నేహితులను డ్రాప్ చేసి ఎయిర్ పోర్టుకు వెళ్తుండగా… కారు డ్రైవర్ ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. మామిడిపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత యువతి డయల్ 100 ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. తక్షణం స్పందించిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు. నాగర్ కర్నూలు లో ఒక మహిళపై ఎనిమిది మంది యువకులు అత్యాచారం చేసిన ఘటన మరవకముందే… జర్మనీ యువతిపై అత్యాచారంకు పాల్పడటం తెలంగాణాలో కలకలం రేపుతోంది.
Also Read : Telangana High Court: రైల్ రోకో కేసులో కేసీఆర్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ