Zelenksy Ukraine : ఓ వైపు రష్యా చీఫ్ వ్లాదిమీర్ పుతిన్ తన పంతం వీడడం లేదు. ఏకపక్షంగా ఉక్రెయిన్ పై దాడులకు తెగబడ్డాడు. యావత్ ప్రపంచం వద్దన్నా తాను ఒప్పుకునే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశాడు.
అంతే కాదు తనపై ఎన్ని ఆర్థిక ఆంక్షలు విధించినా డోంట్ కేర్ అంటూ ముందుకు సాగాడు. ఎట్టి పరిస్థితుల్లో ఉక్రెయిన్ ను విడిచి పెట్టనని, ఆ దేశ ఆర్మీతో పాటు అద్యక్షుడు జెలెన్స్కీ (Zelenksy Ukraine)లొంగి పోవాలని అప్పుడే చర్చలకు సిద్దమంటూ ప్రకటించాడు.
ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే ఇంకో వైపు దాడులకు తెగబడుతున్న రష్యా ఇప్పుడు ప్రపంచం ముందు దోషిగా నిలబడింది. ఉక్రెయిన్ చీఫ్ ఎక్కడా తగ్గడం లేదు. యుద్దానికి సై అంటూనే కదన రంగంలోకి దూకాడు.
ఓ వైపు సైనిక దళాలకు వెన్ను దన్నుగా నిలిచాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా జెలెన్స్కీ హీరోగా మారి పోయాడు. ఈ తరుణంలో అమెరికా ఉక్రెయిన్ చీఫ్ కు అరుదైన ఆహ్వానం అందింది.
ఇందులో భాగంగా సెనేట్ లో ప్రసంగించాలని కోరింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో జెలెన్స్కీ మాట్లాడతారు. ఇందులో భాగంగా అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ ఉక్రెయిన్ చీఫ్ తో టచ్ లో ఉన్నారు.
రష్యా దాడికి దిగిన నాటి నుంచి జెలెన్స్కీకి మద్దతు తెలుపుతూ వస్తున్నారు. రష్యా దాడులను ఖండించారు. ఏ మాత్రం ఆయనకు ఉపాయం తలపెట్టినట్లయితే తాము ఊరుకోబోమంటూ వార్నింగ్ ఇచ్చారు బైడెన్.
సెనేట్ లో ఉన్న సభ్యులందరితో ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడతారు. మరో వైపు జెలెన్స్కీ మద్దతుగా యూరోప్ అంతటా ప్రదర్శనలు జరుగుతున్నాయి.
Also Read : బాంబు పేలుడులో పెరిగిన మృతుల సంఖ్య