Rashid Latif IPL : ఐపీఎల్ ఆట కాదు ప‌క్కా వ్యాపారం – ల‌తీఫ్

పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాకింగ్ కామెంట్స్

Rashid Latif IPL : భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి ఏటా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) నిర్వ‌హిస్తూ వ‌స్తోంది. ఈ ఏడాది బీసీసీఐకి భారీ ఎత్తున ఆదాయం స‌మ‌కూరింది.

ఐపీఎల్ కు సంబంధించి 2023 నుంచి 2027 వ‌ర‌కు డిజిట‌ల్ , టీవీ రైట్స్ వేలం పాట‌లో ఊహించ‌ని రీతిలో డ‌బ్బులు వ‌చ్చి ప‌డ్డాయి. బీసీసీఐ రూ. 48, 390 కోట్లు వ‌సూలు చేసింది.

ప్ర‌పంచ క్రీడా చ‌రిత్ర‌లో అన్ని లీగ్ ల కంటే రెండో స్థానంలో నిలిచింది. ఇది ఓ రికార్డ్ . భార‌త దేశ క్రీడా చ‌రిత్ర‌లో ఇది ఓ రికార్డ్. అయితే ఇటీవ‌లే పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిది అఫ్రిదీ కూడా కీల‌క కామెంట్స్ చేశాడు.

అదేమిటంటే ప్ర‌పంచ క్రికెట్ ను బీసీసీఐ శాసిస్తోంద‌ని అన్నాడు. అంతే కాదు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చేతిలో ఏమీ లేద‌న్నాడు.

విచిత్రం ఏమిటంటే పాకిస్తాన్ ప్రిమీయ‌ర్ లీగ్ కూడా ఏర్పాటు చేసినా భార‌త్ లోని ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు వ‌చ్చిన ఆదాయంలో క‌నీసం 5 శాతానికి మించి లేక పోవ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు ఇంగ్లండ్ ఆట‌గాళ్లు సైతం ఐపీఎల్ వ‌ల్ల ఆట చెడి పోతోందంటూ గగ్గోలు పెట్టారు. కానీ ఆ దేశానికి చెందిన ఆట‌గాళ్లు సైతం ఐపీఎల్ లో ఆడుతూ కోట్లు కొల్ల‌గొట్టారు.

ఇది ప‌క్క‌న పెడితే తాజాగా పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ర‌షీద్ ల‌తీఫ్(Rashid Latif IPL) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. త‌న యూట్యూబ్ ఛాన‌ల్ వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించాడు.

ఐపీఎల్ ఆట ఆడ‌డం లేద‌ని. ఫ‌క్తు వ్యాపారం న‌డుస్తోందంటూ కామెంట్ చేశాడు. ప్ర‌స్తుతం ర‌షీద్ ల‌తీఫ్(Rashid Latif IPL) చేసిన వ్యాఖ్య‌లు క్రికెట్ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్

Leave A Reply

Your Email Id will not be published!