Rashmika Mandanna : త‌ల‌ప‌తి..ర‌ష్మిక మూవీ ప్రారంభం

చెప్ప‌లేనంత ఆనందంగా ఉంది

Rashmika Mandanna : త‌మిళ సినీ రంగంలో ఆయ‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త ఉంది. ల‌క్ష‌లాది మంది అభిమానుల‌ను క‌లిగి ఉన్న ఏకైక‌, అరుదైన న‌టుడు ఇల‌య త‌ల‌ప‌తి విజ‌య్. ఇప్ప‌టికే సౌత్ ఇండియాలో మోస్ట్ పాపుల‌ర్ హీరోగా పేరొందాడు.

అంతే కాదు అత్య‌ధిక రెమ్యూన‌రేష‌న్ అందుకుంటున‌న యాక్ట‌ర్ గా గుర్తింపు పొందారు. ఇదే స‌మ‌యంలో ఇటీవ‌ల డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ది పుష్ప మూవీ సెన్సేష‌న్ క్రియేట్ చేసింది.

ఇందులో న‌టించిన ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna)పేరు దేశ మంత‌టా వైర‌స్ లా వ్యాపించింది. ఆమె న‌ట‌న‌కు వంద శాతం మార్కులు ప‌డ్డాయి.

ఈ త‌రుణంలో ఓ వైపు ఇండియ‌న్ స్టార్ హీరో త‌ల‌ప‌తి విజ‌య్ ఇంకో వైపు నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక (Rashmika Mandanna)క‌లిసి సినిమా చేయ‌బోతున్నారంటూ గ‌త కొన్ని రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతూ వ‌చ్చింది.

తాజాగా ఆ ప్ర‌చారాన్ని నిజం చేస్తూ చెన్నైలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఏకంగా విజ‌య్ తో క‌లిసి సినిమా ప్రారంభోత్సం లో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా త‌న అధికారిక సామాజిక మాధ్య‌మాల‌లో స‌ద‌రు ఫోటోల‌ను షేర్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ ఫోటోలు హ‌ల్ చ‌ల్ అవుతున్నాయి. ఏజ్ పెరిగినా ఇప్ప‌టికీ న‌వ మ‌న్మ‌ధుడిలా క‌నిపించే విజ‌య్ స‌ర‌స‌న తాను హీరోయిన్ గా న‌టిస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదంటూ పేర్కొంది ర‌ష్మిక మందన్నా.

ఇదిలా ఉండ‌గా విజ‌య్ తొలిసారిగా తెలుగులో న‌టిస్తున్న స్ట్రెయిట్ పిక్చ‌ర్ కావ‌డం విశేషం. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు దీనిని నిర్మిస్తున్నారు. కాగా తెలుగు, త‌మిళ భాష‌ల్లో వంశీ పైడిప‌ల్లి తెర‌కెక్కిస్తుండడం విశేషం.

Also Read : శ్రీదేవి శోభన్ బాబు టీజ‌ర్ రిలీజ్

Leave A Reply

Your Email Id will not be published!