TTD Ratha Sapthami : తిరుమలలో పోటెత్తిన భక్తజనం
వీఐపీ బ్రేక్..ఆర్జిత సేవలు రద్దు
TTD Ratha Sapthami : రథ సప్తమి కావడంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. భారీ ఎత్తున తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేసింది. ఇవాళ శ్రీ వేంకటేశ్వరుడు సప్త వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తిరుమల కొండ ప్రాంతమంతా భక్తులతో నిండి పోయింది. ఎటు చూసినా గోవిందా గోవిందా నామ జపంతో పుణ్య క్షేత్రం దద్దరిల్లుతోంది.
కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా తిరుమల వినుతికెక్కింది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు స్వామి వారిని కొలుస్తారు. తమ ఇష్ట దైవంగా భావిస్తారు. ప్రతి ఇంటిల్లిపాది స్వామ, అమ్మ వార్లను కొలువడం ఆనవాయితీగా వస్తోంది. రథ సప్తమిని పురస్కరించుకుని టీటీడీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. సూర్య ప్రభ వాహనంపై మలయప్ప స్వామి భక్తులకు దర్శనం(TTD Ratha Sapthami) ఇవ్వనున్నారు.
ఇవాళ శ్రీవారు సూర్య ప్రభ వాహనంతో పాటు చిన్న శేష వాహనం, గరుడ వాహనం, కల్పవృక్ష, సర్వ భూపాల, చంద్రప్రభ వాహనాలపై ఊరేగుతారు. ఒక రకంగా బ్రహ్మోత్సవాలను తలపింప చేస్తుంది అని చెప్పక తప్పదు. పిల్లల తల్లిదండ్రులు, వృద్దులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ వసతి సౌకర్యాలను ఏర్పాటు చేసింది. మాడ వీధుల్లోని గ్యాలరీల్లో అన్న ప్రసాదాలు అందజేసేలా చేసింది.
ఓ వైపు చలి వణికిస్తోంది. తాత్కాలికంగా షెడ్లను ఏర్పాటు చేసింది టీటీడీ(TTD Ratha Sapthami) . అయినా భక్తులు తట్టుకుని ఆరుబయటే శ్రీ వేంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ ల దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇదిలా ఉండగా భక్తుల తాకిడి అధికంగా ఉండడంతో అదనంగా భారీ ఎత్తున లడ్డూ ప్రసాదాన్ని అందుబాటులో ఉంచింది.
Also Read : లాజిస్టిక్ సేవలతో భారీ ఆదాయం – సజ్జనార్