Ravi Shankar Prasad : నితీశ్ కుమార్ పచ్చి అవకాశవాది
జేడీయూ చీఫ్ పై రవి శంకర్ ప్రసాద్
Ravi Shankar Prasad : బీహార్ లో 17 ఏళ్లుగా ఏర్పాటైన సంకీర్ణ సర్కార్ లో ఉన్నట్టుండి కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన భారతీయ జనతా పార్టీకి నితీశ్ కుమార్ కోలుకోలేని షాక్ ఇచ్చారని ఆరోపించారు బీహార్ బీజేపీ ఇన్ చార్జ్ , కేంద్ర మాజీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ (Ravi Shankar Prasad) .
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన మిత్ర ధర్మాన్ని పాటించ లేదని ధ్వజమెత్తారు. నితీశ్ కుమార్ పచ్చి అవకాశ వాది అంటూ సంచలన ఆరోపణలు చేశారు.
2020 ఎన్నికల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) నాయకత్వంలో ఆయన గెలుపొందిన విషయం మరిచి పోయారా అంటూ ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో మీరు స్వంతంగా గెలిచారా అని నిలదీశారు.
మా సపోర్ట్ లేకుండా 14 మంది ఎంపీలు గెలిచే వారా అని మండిపడ్డారు. బీహార్ లో ప్రజాస్వామ్య స్పూర్తికి భంగం కలిగిస్తూ ప్రజలను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవినీతికి పాల్పడ్డారంటూ గతంలో కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ తో ఏర్పడిన మహా కూటమిని నిందించారు. ఆపై తమ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు.
గత కొన్నేళ్లుగా తన పార్టీని, తనను కాపాడుకుంటూ వచ్చారు. తన లబ్ది చూసుకున్నారు. చివరకు తమను మోసం చేశారంటూ ధ్వజమెత్తారు రవి శంకర్ ప్రసాద్(Ravi Shankar Prasad).
ఈ రోజు ఏం జరిగింది. అవినీతి అన్నది అంతమైందా. అలాంటప్పుడు ఇలాంటి అపవిత్ర పొత్తును ఎలా మీరు సమర్థించుకుంటారంటూ నిప్పులు చెరిగారు.
బీజేపీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందంటూ ఆరోపించారు. మరి 2020లో ఎందుకు కంటిన్యూ చేశారంటూ నిలదీశారు.
Also Read : లాలూ..రబ్రీజీ నన్ను మన్నించండి