Ravi Shastri Samson : టీమిండియాకు శాంసన్ అవసరం
సంచలన కామెంట్స్ చేసిన రవిశాస్త్రి
Ravi Shastri Samson : భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాజస్తాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ గా ఇండియన్ ప్రిమీయర్ లీగ్ 2022లో తన జట్టును 14 ఏళ్ల తర్వాత ఫైనల్స్ కు చేర్చాడు.
అద్బుతమైన నాయకత్వ ప్రతిభను కనబర్చి విమర్శకులను సైతం ఆకట్టుకున్నాడు. ఇదే సమయంలో ప్రస్తుతం హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం మీడియాతో మాట్లాడుతూ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ పాండ్యాతో పాటు ఆర్ఆర్ స్కిప్పర్ సంజూ శాంసన్ ను ఆకాశానికి ఎత్తేశాడు.
వారిద్దరి నాయకత్వ ప్రతిభా పాటవాలు అద్భుతమని కితాబు ఇచ్చాడు. ఈ తరుణంలో రవిశాస్త్రి(Ravi Shastri Samson) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాను ఎంపిక చేసి శాంసన్ ను పక్కన పెట్టింది బీసీసీఐ.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. భారీ ఇన్నింగ్స్ లు ఆడక పోయినా కీలక సమయంలో రన్స్ చేశాడు శాంసన్.
త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు రాణించాలంటే తప్పకుండా స్టార్ హిట్టర్ గా పేరొందిన సంజూ శాంసన్ అత్యంత అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
ఆ దేశంలో అతడి ట్రాక్ రికార్డు కూడా గొప్పగా ఉందన్నాడు. ఇతర ఆటగాళ్లకు తీసిపోని విధంగా స్ట్రైక్ రేట్ ఉందని గుర్తు చేశాడు రవిశాస్త్రి(Ravi Shastri Samson). చక్కని ఫామ్ లో ఉన్నాడని, శాంసన్ ను తప్పకుండా ఎంపిక చేసే సమయంలో పరిగణలోకి తీసుకోవాలని సూచించాడు.
ఇదిలా ఉండగా రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు ఆడేందుకు. ఆస్ట్రేలియా పిచ్ లు డిఫరెంట్ గా ఉంటాయని అక్కడ ఎలాంటి బౌలర్లను ఎదుర్కొనే సత్తా అతడికి ఉందన్నాడు రవిశాస్త్రి.
బౌన్స్ , పేస్ , కట్ , పుల్ వంటి పరిస్థితుల్లో తట్టుకుని ఆడే స్వభావం సంజూకి మాత్రమే ఉందన్నాడు.
Also Read : పాకిస్తాన్ బౌలర్లకు షాకిచ్చిన షాయ్