Ravi Shastri : రాజస్థాన్ రాయల్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న యజువేంద్ర చాహల్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే బీసీసీఐ దీనిపై ఫోకస్ పెట్టింది.
తాను ముంబై ఇండియన్స్ కు ఆడుతున్న సమయంలో 2013లో ఓ ఘటన చోటు చేసుకుందని తెలిపాడు చాహల్. తాము బెంగళూరులో మ్యాచ్ ఆడామని, గెలిచాక గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు జరిగిందన్నాడు.
ఆ సమయంలో ఓ క్రికెటర్ తప్ప తాగి వచ్చి తనను ఇబ్బంది పెట్టాడని, అంతే కాకుండా 15వ అంతస్తులో ఉన్న తనను అమాంతం వేలాడ దీశాడని వాపోయాడు.
ఈ విషయాన్ని తన తోటి ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, కరుణ్ నాయర్ తో కలిసి పంచుకున్నాడు. బాల్కానీలో వేలాడ దీసిన విషయం ఇప్పటికీ తనను కలిచి వేస్తోందని కన్నీటి పర్యంతం అయ్యాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే తాజా మాజీ ఆటగాళ్లు స్పందించారు. వీరేంద్ర సెహ్వాగ్ అయితే చహల్ ను ఆ క్రికెటర్ ఎవరో చెప్పాలని డిమాండ్ చేశాడు.
తాజాగా దీనిపై స్పందించాడు భారత క్రికెట్ జట్టు మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి. ఈ ఘటన అత్యంత బాధాకరమైనదని పేర్కొన్నాడు. దీనిని అస్సలు క్షమించ రానిదని, దీనిపై ప్రత్యేకంగా విచారణ జరిపించాలని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
సదరు నేరస్తుడిపై జీవిత కాలం నిషేధం విధించాలని కోరారు రవిశాస్త్రి(Ravi Shastri ). ప్రస్తుతం చహల్ వ్యవహారం చర్చకు దారి తీసింది.
ఇది అసలు ఆమోద యోగ్యం కాదని పేర్కొన్నాడు మాజీ హెడ్ కోచ్.
Also Read : రిషబ్ పంత్ పై వీరూ కామెంట్స్