Ravindra Jadeja : భారత క్రికెట్ జట్టు ప్లేయర్ రవీంద్ర జడేజా స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ను వెనకేసుకు వచ్చాడు.
తాజాగా మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న ఫస్ట్ టెస్టులో భారత జట్టు మొదటి ఇన్నింగ్స్ లో 8 వికెట్లు కోల్పోయి 574 పరుగుల భారీ స్కోర్ సాధించింది.
ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం వహించింది. ఆ జట్టు కష్టాల్లో ఉంది. ఇదే సమయంలో ఫస్ట్ ఇన్నింగ్స్ లో భారత స్టార్ ప్లేయర్ రిషబ్ పంత్ 97 బంతుల్లో 96 పరుగులు చేసి మారథన్ ఇన్నింగ్స్ ఆడాడు.
ఇదే సమయంలో ఏడో స్థానంలో మైదానంలోకి వచ్చిన జడ్డూ అలియాస్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja)దుమ్ము రేపాడు. అద్భుతమైన షాట్లతో అలరించాడు.
ఇదే సమయంలో 175 పరుగులు చేశాడు. తన కెరీర్ లో ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. గాయంతో గ్యాప్ తీసుకున్న ఈ ప్లేయర్ కళాత్మకమైన షాట్లతో అలరించాడు.
కాగా ఇంకా 25 పరుగులు చేసి ఉంటే రవీంద్ర జడేజా డబుల్ సెంచరీ సాధించి ఉండేవాడు. ఇంకా టెస్టు మ్యాచ్ కు కావాల్సినంత సమయం ఉంది. దీనిపై పెద్ద ఎత్తున రాద్దాంతం చెలరేగింది.
కావాలనే జడ్డూ 200 పరుగులు చేయకుండా కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అడ్డుకున్నారంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ కొనసాగింది.
ఈ వివాదం ముదరడంతో ముందుగా జడ్డూ స్పందించాడు. బంతులు బౌన్స్ అవుతున్నాయని పరుగులు చేయడం కష్టమని తానే ఇన్నింగ్స్ డిక్లేర్ చేయమని చెప్పానని వాళ్ల తప్పేమీ లేదన్నాడు.
Also Read : చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్