Ravindra Jadeja : ర‌వీంద్ర జ‌డేజా రియ‌ల్ ఫినిష‌ర్

ఛాంపియ‌న్ గా నిలిచిన ధోనీసేన

Ravindra Jadeja : రెండు నెల‌లుగా ఉర్రూత లూగించి కోట్లాది అభిమానుల గుండెల్ని పిండేసేలా చేసిన ఐపీఎల్ క‌థ ముగిసింది. ఆఖ‌రి అంకం ఉత్కంఠ భ‌రితంగా సాగింది. రెండు స‌మ ఉజ్జీల మ‌ధ్య పోరాటం ఎలా ఉంటుందో చేసి చూపించారు చెన్నై సూప‌ర్ కింగ్స్ , గుజ‌రాత్ టైటాన్స్. ఆఖ‌రి ఓవ‌ర్ లో 13 ప‌రుగులు కావాల్సి వ‌చ్చింది. డాట్ బాల్స్ ప‌డ‌డంతో గెలుపు గుజ‌రాత్ ను సూచించింది. కానీ క్రీజులో ఉన్న‌ది రవీంద్ర జ‌డేజా(Ravindra Jadeja). గ‌తంలో ఆడిన ప‌లు మ్యాచ్ ల‌లో రియ‌ల్ ఫినిష‌ర్ గా నిలిచాడు.

సీఎస్కే ఫ్యాన్స్ లో న‌రాలు తెగేలా ఉత్కంఠ కొన‌సాగింది. కానీ ఒకే ఒక్క‌డు మ‌హేంద్ర సింగ్ ధోనీ మాత్రం చాలా కూల్ గా ఉన్నాడు. ఎందుకంటే అత‌డికి జ‌డ్డూ మీద ఆపార‌మైన న‌మ్మ‌కం. అంత‌కంటే విశ్వాసం కూడా. త‌ను ఆరాధించే నాయ‌కుడి అంచ‌నాల‌కు మించి రాణించాడు. ఆఖ‌రి ఓవ‌ర్ లో రెండు బంతులు మిగిలి ఉన్నాయి. జ‌డేజా మోస్ట్ డేంజ‌ర‌స్ అని కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు తెలుసు. అందుకే పేస‌ర్ మోహిత్ శ‌ర్మ‌కు ఛాన్స్ ఇచ్చాడు.

కానీ 5వ బంతిని సిక్స్ కొట్టి 4వ బంతిని ఫోర్ తో ముగించాడు. త‌న క్రికెట్ చ‌రిత్ర‌లో చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ కు చేకూర్చి పెట్టాడు జ‌డేజా. ఐపీఎల్ ఫైన‌ల్ లో రియ‌ల్ హీరోగా ఇప్పుడు మారి పోయాడు. సోష‌ల్ మీడియా అత‌డితో హోరెత్తి పోతోంది. కెప్టెన్ ధోనీ సైతం జ‌డ్డూను హ‌త్తుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటోలు , వీడియోలు వైర‌ల్ గా మ‌రాయి.

మొత్తంగా రెండోసారి ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిల‌వాల‌ని క‌ల‌లు క‌న్న గుజ‌రాత్ టైటాన్స్ కు కోలుకోలేని షాక్ ఇచ్చాడు ర‌వీంద్ర జ‌డేజా. తాము నిజ‌మైన ఛాంపియ‌న్ల‌మ‌ని మ‌రోసారి నిరూపించారు ధోనీ సేన .

Also Read : GT vs CSK IPL 2023

Leave A Reply

Your Email Id will not be published!