Ravneet Singh Bittu : రాహుల్ ను టెర్రరిస్ట్ అంటూ సంబోధించిన కేంద్ర మంత్రిపై బెంగళూరు లో కేసు

అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా మన దేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు...

Ravneet Singh Bittu : లోక్‪సభ పక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీను టెర్రరిస్టు అని సంభోదించిన కేంద్ర మంత్రిపై గురువారం కేసు నమోదైంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుల్లో ఒకరు బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీస్ స్టేషన్‪లో కేంద్రమంత్రిపై ఫిర్యాదు చేశారు. రవ్‌నీత్ సింగ్ బిట్టూ(Ravneet Singh Bittu) ఇటీవలే రాహుల్‌ను ‘నెంబర్ వన్ టెర్రరిస్ట్’గా పేర్కొన్నారు. సిక్కు వర్గాలను ఉద్దేశించి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ, రాహుల్ గాంధీ అసలు భారతీయుడే కాదని అన్నారు. ” రాహుల్ ఇండియన్ కాదు. ఆయన ఎక్కువ సమయం బయటే గడిపారు. ఆయనకు ఈ దేశంపై ఏమాత్రం ప్రేమ లేదు.

అందువల్లే విదేశాలకు వెళ్లినప్పుడల్లా మన దేశాన్ని వక్రీకరించి మాట్లాడుతుంటారు. రాహుల్(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలను మోస్ట్ వాటెండ్ పీపుల్, వేర్పాటువాదులు, బాంబులు-తుపాకులు-బుల్లెట్ల తయారీ నిపుణులు మాత్రమే అభినందిస్తుంటారు. వాళ్లు కూడా రాహుల్ మాట్లాడినట్టే మాట్లాడతారు. అలాంటి వ్యక్తులు రాహుల్‌కు మద్దతు తెలుపుతున్నారంటే దేశంలో నెంబర్ వన్ టెర్రరిస్టు ఆయనే అవుతారు” అని బిట్టూ సంచలన వ్యాఖ్యలు చేశారు. విమానాలు, రైళ్లు, రోడ్డు పేల్చేసేందుకు కుట్రలు పన్నే ఈ దేశ శత్రువులే రాహుల్ గాంధీకి మద్దతిస్తుంటారని బిట్టూ విమర్శించారు. దేశానికి అతిపెద్ద శత్రువును పట్టుకునేందుకు రివార్డంటూ ఏదైనా ఉంటే ఆ వ్యక్తి రాహుల్ గాంధీయేనని తన అభిప్రాయమని చెప్పారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు బిట్టూ కాంగ్రెస్ పార్టీని విడిచి బీజేపీలో చేరారు.

Ravneet Singh Bittu Got Case…

వర్జీనియాలో ఇటీవల జరిగిన కార్యక్రమంలో సిక్కుల గురించి రాహుల్ మాట్లాడుతూ ”సిక్కులు తలపాగా ధరించడానికి అనుమతిస్తారా లేదా అనే దానిపై భారత్‌లో పోరాటం జరుగుతోంది. సిక్కులు కడాను ధరించి, గురుద్వారాలను సందర్శించడానికి అనుమతిస్తారా? ఇది సిక్కులకు మాత్రమే కాదు. అన్ని మతాలకు సంబంధించింది” అని రాహుల్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఢిల్లీలోని రాహుల్ ఇంటిముందు ఆందోళన సైతం చేపట్టింది.

Also Read : Pawan Kalyan – Balineni : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిసిన మాజీ మంత్రి బాలినేని

Leave A Reply

Your Email Id will not be published!