RBI Asks Banks Adani : అదానీ రుణాలపై ఆర్బీఐ ఆరా
ప్రభుత్వ, ప్రభుత్వేర బ్యాంకులకు ఆదేశం
RBI Asks Banks Adani : భారతీయ దిగ్గజ వ్యాపార సంస్థ అదానీ గ్రూప్ వ్యవహారం అటు పార్లమెంట్ లో దుమారం రేపుతుండగా మరో వైపు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసేలా చేసింది. ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీ, ఎస్బీఐ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయి. వీటిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. తాజాగా మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. అదానీ గ్రూప్ ఏయే ప్రభుత్వ, ప్రభుత్వేతర బ్యాంకులలో ఎన్నెన్ని రుణాలు తీసుకుందో వివరాలు అందజేయాలని(RBI Asks Banks Adani) కోరినట్లుసమాచారం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతం అదానీ వీడియో ద్వారా అంతా బాగుందని చెప్పినా కంటిన్యూగా షేర్లు పతనం చెందుతూనే ఉన్నాయి.
అదానీ గ్రూపు సంస్థలలో ఇన్వెస్ట్ చేసిన వాళ్లంతా తమ డబ్బులు వెనక్కి తీసుకుంటున్నారు. దీనిపై మరోవైపు ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి ఉభయ సభల్లో. ఇదిలా ఉండగా అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు గురువారం కూడా స్టాక్ మార్కెట్ లో భారీగా పతనం అయ్యాయి. కాగా అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ సంచలన ఆరోపణలు చేసింది.
అదానీ గ్రూప్ చెబుతున్న లెక్కలన్నీ తప్పుడు తడకలంటూ ఆరోపించింది. ఆపై 36 పేజీల నివేదికను బట్టబయలు చేసింది. తాము అనుమానం వ్యక్తం చేసిన ప్రశ్నలకు వేటికీ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదని పేర్కొంది. ప్రస్తుతం ఆర్బీఐ వివరాలు కోరడం కలకలం రేపింది.
మరో వైపు అదానీ ఎంటర్ ప్రైజెస్ , అదానీ పోర్ట్స్ , అదానీ విల్మార్ , అదానీ పవర్ , అదానీ ట్రాన్స్ మిషన్ , అదానీ గ్రీన్ ఎనర్జీ , అదానీ టోటల్ గ్యాస్ షేర్లు భారీగా పతనం అయ్యాయి.
Also Read : అదానీ’ స్కాంపై విచారణ జరగాలి