RBI Hikes : ఆర్బీఐ బిగ్ షాక్ రెపో రేటు పెంపు
వినియోగదారులకు కోలుకోలేని దెబ్బ
RBI Hikes : ఓ వైపు ద్రవ్యోల్బణం మరో వైపు నిరుద్యోగం దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఈ తరుణంలో దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేసే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం ప్రకటించింది. ఇప్పటికే ధరల మోతతో దద్దరిల్లుతోంది. శుక్రవారం ఆర్బీఐ(RBI Hikes) కీలక రుణ రేటును పెంచుతున్నట్లు వెల్లడించింది. 50 బేసిస్ పాయింట్లతో 5.90 శాతానికి పెంచింది.
పెరిగిన ద్రవ్యోల్బణం , దూకుడుగా ఉన్న గ్లోబల్ సెంట్రల్ బ్యాంక్ విధానాలు, ఆర్థిక మార్కెట్ లలో గందరగోళం కారనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కీలక రుణ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది 2022 ప్రతి నెలా ఆర్బీఐ గరిష్ట(RBI Hikes) సహన పరిమితి 6 శాతం కంటే ఎక్కువగా ఉన్న దేశీయ రిటైల్ ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు నిర్ణయించింది.
ప్రధానంగా సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఇప్పటికే మే నుండి కీలక పాలసీ రేటును 140 బీపీఎస్ ల మేర 5.4 శాతానికి పెంచింది. ఇదే క్రమంలో తగ్గుతున్న కమోడిటీ ధరలు కొంత ఉపశమనాన్ని అందిస్తాయని ఆర్థిక రంగ నిపుణులు భావిస్తున్నారు.
అయితే కఠినమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితులు , అధిక ద్రవ్యోల్బణం ప్రధాన కారణంగా మారింది. రెపో రేటు పెరగడం వల్ల రుణాలు మరింత భారం కానున్నాయి. దీని వల్ల నిర్మాణ , రియల్ ఎస్టేట్ రంగాలపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు భావిస్తున్నారు.
మరో వైపు రెపో రేటు పెంచడం ఇది నిరంతరం కొనసాగుతూనే ఉంది. ప్రత్యేకించి అన్ని రంగాలపై కీలక ప్రభావం చూపనుందని హెచ్చరిస్తున్నారు.
Also Read : త్వరలో హెచ్-1బి వీసా స్టాంపింగ్