RBI Governor : ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ నెంబ‌ర్ 1

గ్లోబ‌ల్ ర్యాంకింగ్స్ లో టాప్

RBI Governor : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్ అరుదైన ఘ‌న‌త సాధించారు. గ్లోబ‌ల్ ఫైనాన్స్ సెంట్ర‌ల్ బ్యాంక‌ర్ రిపోర్ట్ కార్డ్స్ 2023లో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ A+ రేటింగ్ పొందారు. ఈ రేటింగ్ లో వ‌ర‌ల్డ్ వైడ్ గా ముగ్గురు ఆర్థిక సంస్థ‌ల‌కు సంబంధించి టాప్ లో నిలిచారు. ఇందులో ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ నెంబ‌ర్ వ‌న్ పొజిష‌న్ ద‌క్కించుకున్నారు.

RBI Governor Got A+ Rating

ఇదిలా ఉండ‌గా గ్లోబ‌ల్ సెంట్ర‌ల్ బ్యాంక‌ర్ రిపోర్ట్ కార్డ్స్ లో మ‌న గ‌వ‌ర్న‌ర్ టాప్ లో నిల‌వ‌డంపై స్పందించారు దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. శ‌నివారం ట్విట్ట‌ర్ వేదిక‌గా పీఎం స్పందించారు. గ‌వ‌ర్న‌ర్ శ‌క్తి కాంత దాస్(RBI Governor) ను ప్ర‌త్యేకంగా అభినంద‌న‌ల‌తో ముంచెత్తారు.

ఓ వైపు చంద్ర‌యాన్ -3తో , ఆదిత్యా – ఎల్ 1 ఉప‌గ్ర‌హం తో ప్ర‌పంచ వ్యాప్తంగా భార‌త దేశ ఖ్యాతి వెలుగొందుతున్న త‌రుణంలో శ‌క్తికాంత దాస్ సైతం టాప్ లో నిల‌వ‌డం మ‌నంద‌రికీ గ‌ర్వ కార‌ణ‌మ‌ని మోదీ పేర్కొన్నారు.

ఇవాళ భార‌తీయ ఆర్థిక వ్య‌వ‌స్థ స‌మ స్థితిలో ఉంద‌న్నారు. ద్ర‌వ్యోల్బ‌ణం లేకుండా చూసేందుకు గ‌వ‌ర్న‌ర్ శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తున్నారంటూ కితాబు ఇచ్చారు. రాబోయే కాలంలో భార‌త దేశం అన్ని రంగాల‌లో టాప్ లో నిలుస్తుంద‌న్న ఆశాభావం వ్య‌క్తం చేశారు.

Also Read : Vijay Sai Reddy : అమ‌రావ‌తి అనేది బిగ్ స్కాం

Leave A Reply

Your Email Id will not be published!