Pawan Kalyan Rekki : పవన్ ఇంటి వద్ద రెక్కీ అబద్దం – పోలీస్
దాడికి కుట్ర అన్నది పూర్తిగా అవాస్తవం
Pawan Kalyan Rekki : జనసేన చీఫ్, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర జరిగిందని, రెక్కీ(Pawan Kalyan Rekki) కూడా నిర్వహించరంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై జనసేన పార్టీ పెద్ద ఎత్తున ప్రస్తావించింది. తెగ ప్రచారం కూడా చేపట్టింది. దీంతో వాస్తవం ఏం జరిగిందనే దానిపై తెలంగాణ పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు.
అదంతా బక్వాస్ అని తేల్చి పారేశారు. పవన్ పై దాడికి ఎలాంటి కుట్ర చోటు చేసు కోలేదని స్పష్టం చేశారు. జనసేన శ్రేణులు చేసిన ఆరోపణలు నిజమా కాదా అన్న దానిపై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు పూర్తిగా విచారణ చేపట్టారు. ఇందులో అసలు వాస్తవం బయట పడింది. పవన్ ఇంటి వద్ద ముగ్గురు యువకులు న్యూసెన్స్ చేశారని తెలిపారు.
వారిని ఆదిత్య విజయ్, వినోద్ , సాయి కృష్ణ గా గుర్తించినట్లు పేర్కొన్నారు. మద్యం మత్తులో ఉన్న వారు తాము హల్ చల్ చేసిన మాట వాస్తవమేనంటూ ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ ముగ్గురు పబ్ కు వెళ్లారు. ఫుల్ గా మద్యాన్ని లాగించారు. తాగిన మైకంలో పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఉన్న సెక్యూరిటీతో గొడవకు దిగారు.
కారును తీయాలని చెప్పిన భద్రతా సిబ్బందితో గొడవకు దిగారు. దీనిని తప్పుగా అర్థం చేసుకున్న జనసేన శ్రేణులు దాడికి కుట్ర జరిగిందని, రెక్కీ చేపట్టారంటూ గగ్గోలు పెట్టారు. సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. తీరా పోలీసుల విచారణలో తప్పని తేలింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి నివేదికను జూబ్లీహిల్స్ పోలీసులు తెలంగాణ డీజీపీకి సమర్పించారు.
ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేశారు. అదంతా అబద్దమని తేల్చారు.
Also Read : ఆ నలుగురికి ఫుల్ సెక్యూరిటీ