Supreme Court : స్వాతంత్రోద్యమ కాలంలో మహాత్మా గాంధీ, తదితర నాయకుల నోరు మూయించేందుకు ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం దేశ ద్రోహం చట్టాన్ని తీసుకు వచ్చింది. దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లవుతోంది.
అయినా ఇంకా ఆ చట్టం ఎందుకు రద్దు చేయడం లేదంటూ పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలయ్యాయి. దాఖలైన దావాలపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు.
దేశ ద్రోహ చట్టం గురించి గత ఏడాది ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ధర్మాసనం సీరియస్ గా స్పందించింది.
ఆనాటి దేశ ద్రోహ చట్టాన్ని గట్టిగా సమర్థిస్తూ దానిని సవాల్ చేస్తూ పిటిషన్లను కొట్టి వేయాలని సుప్రీంకోర్టును(Supreme Court) కోరింది కేంద్ర ప్రభుత్వం.
ఈ సందర్భంగా మరోసారి దేశ ద్రోహం చట్టాన్ని సమీక్షించాలని నిర్ణయించుకున్నట్లు సర్కార్ తెలిపింది. భారత దేశ సర్వోన్నత న్యాయస్థానలో దాఖలు చేసిన కొత్త అఫిడవిట్ లో కేంద్రం ఇలా పేర్కొంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (75 సంవత్సరాల స్వాతంత్రం) , ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో , భారత ప్రభుత్వం తిరిగి పునః పరిశీలించాలని నిర్ణయించింది.
సెక్షన్ 124ఏ కింద దేశ ద్రోహం కేసు నమోదు చేస్తూ వస్తోంది. సమర్థ ఫోరమ్ ద్వారా సమీక్ష కోసం వేచి ఉండాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా , తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహూవా మోయిత్రా , ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై కోర్టు వ్యాఖ్యానించింది.
దేశ ద్రోహం చట్టాన్ని విస్తృతంగా దుర్వినియోగం చేయడంతో ఆందోళన చెందింది. ఆనాడు గాంధీ నోరు మూయించేందుకు ఏర్పాటు చేసిన ఈ చట్టాన్ని ఎందుకు రద్దు చేయకూడదంటూ ప్రశ్నించింది సుప్రీంకోర్టు.
Also Read : ఢిల్లీలో కూల్చివేతలపై జనాగ్రహం