S Jai Shankar : ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు అవసరం
స్పష్టం చేసిన విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్
S Jai Shankar : భారత దేశ విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్(S Jai Shankar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఐక్య రాజ్య సమితి దాని పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ప్రధానంగా ఐక్య రాజ్య సమితిలో సంస్కరణలు ఉండాలని స్పష్టం చేశారు.
ఇందుకు సంబంధించి ఆచరణాత్మక మార్గాన్ని అభివృద్ది చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు జై శంకర్. భారత దేశానికి వీటో ఉండడం అంటే అర్థం ప్రజలకు స్థిరమైన స్థానాలు, అంతిమ భావనలు ఉన్నట్లు కాదని పేర్కొన్నారు.
అమెరికాలోని న్యూయార్క్ లో జై శంకర్ మీడియాతో మాట్లాడారు. ఐక్య రాజ్య సమితిపై ఆయన తన విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు. ఇక సంస్కరణల అంశంలో మార్పును గ్రహించానని జై శంకర్ చెప్పారు.
ఈ అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించినట్లు తాను భావిస్తున్నట్లు తెలిపారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి. కౌన్సిల్ లోని శాశ్వత, శాశ్వత ప్రతినిధుల సంఖ్యను పెంచేందుకు అమెరికా బేషరతుగా మద్దతు ఇస్తుందని దేశ అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇప్పటికే స్పష్టం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు జై శంకర్.
ఆఫ్రికా, లాటిన్ అమెరికా, కరేబియన్ దేశాలకు వాషింగ్టన్ దీర్ఘకాలంగా మద్దతు ఇస్తోందని చెప్పారు. జనరల్ అసెంబ్లీ పోడియం నుండి రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్ రోవ్ భారత దేశాన్ని స్పష్టంగా ప్రస్తావించారని పేర్కొన్నారు.
అనేక దేశాలు సంపూర్ణంగా భారత్ కు వీటో అధికారం ఉండాలని కోరాయని స్పష్టం చేశారు జై శంకర్.
Also Read : అమెరికా మీడియాపై జై శంకర్ గుస్సా