Reham Khan : పాకిస్తాన్ ప్రధాన మంత్రి, ఆ దేశ జట్టు మాజీ క్రికెట్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో ఆయన నలు వైపుల నుంచి విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
పీఎం మాజీ భార్య , ప్రముఖ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్, రచయిత్రి రెహమ్ ఖాన్(Reham Khan) సంచలన కామెంట్స్ చేశారు. ఇక ఇమ్రాన్ ఖాన్ రాజకీయ భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.
ఒక రకంగా ఆయనపై నిప్పులు చెరిగారు. మోసం చేయడం తప్ప ప్రజలకు సేవ చేయడం తెలియదన్నారు. రాజకీయంగా వచ్చిన అవకాశాన్ని ఖాన్ ఉపయోగంచు కోలేక పోయారని పేర్కొన్నారు.
ద్రవ్యోల్బణం పెరిగింది. నిరుద్యోగం పెచ్చరిల్లింది. దేశంలో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేక పోయారు. పాకిస్తాన్ కు మంచి భవిష్యత్తును అందిస్తానని చెప్పిన ఇమ్రాన్ ఖాన్ వాటిలో ఏ ఒక్కటి నెరవేర్చలేక పోయాడని ఆరోపించారు రెహమ్ ఖాన్(Reham Khan).
దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన సారథ్యంలోనే తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోదని మండిపడ్డారు. ఈరోజు వరకు పాలనా పరంగా ఎలాంటి పట్టు సాధించ లేక పోయాడని ధ్వజమెత్తారు రెహమ్ ఖాన్.
చపల చిత్తం కలిగిన పీఎంకు ప్రధానమంత్రిగా కొనసాగే అర్హత లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తన అనుభవాలతో కూడిన పుస్తకాన్ని రాసే సమయంలో రెహమ్ ఖాన్ పై దాడి జరిగింది.
ఆమెను మట్టు పెట్టాలని ఖాన్ చూశాడనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో మాజీ భార్య అయిన రెహమ్ ఖాన్ పాకిస్తాన్ పీఎంపై మండిపడ్డారు. తనను అంతం చేసినంత మాత్రాన నిజాలు బయటకు రాకుండా ఉండవని హెచ్చరించారు.
Also Read : శ్రీలంక అధ్యక్షుడిపై ప్రజాగ్రహం