Reham Khan : ఇమ్రాన్ ఖాన్ కాదు కామెడీ ఖాన్

మాజీ భార్య‌ రెహ‌మ్ ఖాన్ సెటైర్

Reham Khan : అవిశ్వాస తీర్మానంలో కేవ‌లం 2 ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయిన పాకిస్తాన్ మాజీ కెప్టెన్, ఆ దేశ మాజీ ప్ర‌ధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై మాజీ భార్య రెహ‌మ్ ఖాన్(Reham Khan) సంచ‌ల‌న కామెంట్స్ చేశారు.

ఆమె ముందు నుంచీ ఆయ‌న‌ను వ్య‌తిరేకిస్తూ వ‌స్తున్నారు. న‌టించ‌డంలో ఆస్కార్ ను మించి పోయాడ‌ని ఎద్దేవా చేశారు. తాజాగా భార‌త దేశంలో మోస్ట్ పాపుల‌ర్ షోగా పేరొందిన క‌పిల్ శ‌ర్మ షోలో మాజీ క్రికెట‌ర్ , మాజీ పీసీసీ చీఫ్ న‌వ జ్యోత్ సింగ్ సిద్దూ ప్లేస్ లో క‌రెక్ట్ గా ఇమ్రాన్ ఖాన్ స‌రి పోతాడంటూ ఆమె ఎద్దేవా చేశారు.

ప్ర‌స్తుతం ఆమె చేసిన కామెంట్స్ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఆయ‌న ఇప్ప‌టి దాకా భ్ర‌మ‌ల్లోనే బ‌తికారంటూ మండిప‌డ్డారు రెహ‌మ్ ఖాన్. నాయ‌క‌త్వ నైపుణ్యం లేక పోయినా హాస్య ప్ర‌తిభ బాగానే ఉంద‌ని పేర్కొంది.

ఇమ్రాన్ ఖాన్ అర్ధ‌రాత్రి నాట‌కీయంగా అవిశ్వాస తీర్మానాన్ని కోల్పోయాడు. ఇదే స‌మ‌యంలో త‌న ప‌ద‌వి కోల్పోవ‌డానికి కార‌ణం అమెరికా అంటూ కొత్త నాట‌కానికి తెర లేపాడంటూ ఆరోపించింది రెహ‌మ్ ఖాన్(Reham Khan).

రాజ‌కీయాల‌ను వ‌దిలేసి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తే బెట‌ర్ అని సూచించింది. ఇమ్రాన్ ఖాన్ భావోద్వేగానికి లోన‌య్యాడు. పాకిస్తాన్ ను వ‌దిలేసి ఇండియాకు వెళితే బెట‌ర్ అని మండిపడింది రెహ‌మ్ ఖాన్.

బాలీవుడ్ లో హీరోలు విల‌న్లు అవుతారు. విలన్లు ఎక్కువ పాపుల‌ర్ అవుతారు. కానీ ఖాన్ కు కామెడీ టాలెంట్ ఉంద‌ని సిద్దూ కు బ‌దులు ఈయ‌న ఉంటే బెట‌ర్ అని ఎద్దేవా చేసింది.

Also Read : ఇమ్రాన్ ఖాన్ నెక్లెస్ విక్రయంపై విచార‌ణ

Leave A Reply

Your Email Id will not be published!