ECI : భారత ఎన్నికల సంఘం – ఈసీఐ మరో ఎన్నికల నిర్వహణకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఇవాళ రాజ్యసభకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది.
వచ్చే ఏప్రిల్ నెలలో 13 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటి భర్తీకి సంబంధించి ఈనెల 31న ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. ఈనెల 14న ఈ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
ఇక ఆయా అభ్యర్థులకు సంబంధించి నామినేషన్లు దాఖలు చేసేందుకు తుది గడువు మార్చి 21గా నిర్ణయించింది ఎన్నికల కమిషన్. ఈనెల 22న నామినేషన్లను పరిశీలిస్తారు.
మార్చి 24 లోగా అభ్యర్థులు విత్ డ్రా చేసేందుకు గడువు ఇచ్చింది. ఈనెలాఖరున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుందని భారత ఎన్నికల సంఘం ప్రకటించింది.
అయితే ఓట్లు చాలా తక్కువగా ఉండడంతో అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్లను లెక్కిస్తామని వెల్లడించింది. దీంతో ఆయా రాజ్యసభ సభ్యుల స్థానాలకు పూర్తి స్థాయిలో భర్తీ చేయనుంది ఎన్నికల సంఘం(ECI).
ఇక పెద్దల సభ (రాజ్యసభ)లో పదవీ కాలం పూర్తయ్యే వారిలో మొత్తం పదమూడు మంది సభ్యులు ఉన్నారు. వీరిలో పంజాబ్ రాష్ట్రం నుంచి ఐదు కేరళ నుంచి మూడు, అస్సాం నుంచి రెండు, హిమాచల్ ప్రదేశ్ , నాగాలాండ్ , త్రిపుర నుంచి ఒక్కో సభ్యుడి స్థానానికి భర్తీ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.
పదవీ కాలం పూర్తయిన వారిలో సుఖ్ దేవ్ సింగ్ , ప్రతాప్ సింగ్ బజ్వా, మాలిక్ , గుజ్రాల్ , షంషేర సింగ్ , ఏకే ఆంటోనీ, శ్రేయస్ కుమార్ , సోమ ప్రసాద్ , రాణీ నారా, రిపున్ బోరా, ఆనంద్ శర్మ , కెన్యా, జర్నా దాస్ ఉన్నారు.
Also Read : జస్టిస్ ఖురేషీ వ్యాఖ్యలు కలకలం