Prakash Raj : మత రాజకీయాలు ప్రమాదం – ప్రకాశ్ రాజ్
ఓటు వజ్రాయుధం ప్రజాస్వామ్యానికి బలం
Prakash Raj : ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన కామెంట్స్ చేశారు. బుధవారం కర్ణాటకలో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రజలు తమ విలువైన ఓటును పని చేసే వారికి మాత్రమే ఓటు వేయాలని కోరారు. మత రాజకీయాలకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉందన్నారు ప్రకాశ్ రాజ్(Prakash Raj). కర్ణాటక రాష్ట్రాన్ని మరింత అందంగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న విషయం గుర్తించాలని సూచించారు నటుడు.
ఇవాళ కులం పేరుతో, మతం పేరుతో, ప్రాంతాల పేరుతో ప్రజలను విభజించి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రకాశ్ రాజ్. వాటిని గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించాడు. ఓటు అనేది ఆయుధమని, అది ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్నారు ప్రకాశ్ రాజ్.
ప్రజలకు తమ ముందు ఓటు వేసే ఛాన్స్ వచ్చింది. దానిని కాపాడు కోవాలి. రాష్ట్ర అభివృద్ది ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించ గలిగే వారిని ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకునే బాధ్యత మీపైనే ఉందన్నారు. ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే వాళ్లు బాధ్యతతో పని చేస్తారని స్పష్టం చేశారు. ఇవాళ రాజకీయాలు కులాలు, మతాలు, ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నాయని ఆవేదన చెందారు ప్రకాశ్ రాజ్(Prakash Raj).
Also Read : స్టిక్కర్లపై శ్రద్ధ నీళ్లివ్వడంలో అశ్రద్ద