PM Modi Kharge : ఖర్గేకు అవమానం ‘గాంధీ’లదే పెత్తనం
గాంధీ ఫ్యామిలీ చేతుల్లోనే కాంగ్రెస్
PM Modi Kharge : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. ఆయన ఈసారి సీరియస్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ గా చేసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు నన్ను లక్ష్యంగా చేసుకుని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. మీ కర్నాటకకు చెందిన మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీకి చీఫ్ గా ఎన్నికైనా ఆయన కేవలం అలంకార ప్రాయంగా మిగిలి పోయారంటూ ఎద్దేవా చేశారు. పేరుకు మాత్రమే ఖర్గే(PM Modi Kharge) ..పెత్తనమంతా సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో పర్యటించారు ప్రధానమంత్రి మోదీ. అంతకు ముందు శివమొగ్గలో నూతనంగా నిర్మించిన ఎయిర్ పోర్టును ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఇక ఎన్నికల సందర్భంగా మోదీ నిర్వహించిన రోడ్ షోకు జనం బ్రహ్మరథం పట్టారు. ఎక్కడ చూసినా పూల వర్షం కురిపించారు. మీ ఆదరాభిమానులను మరిచి పోలేనని అన్నారు నరేంద్ర మోదీ.
డబుల్ ఇంజన్ ప్రభుత్వం కావాలని మరోసారి ప్రజలు డిసైడ్ అయ్యారంటూ చెప్పారు. 2014 కంటే ముందు కాంగ్రెస్ హయాంలో దేశం వందేళ్లు వెన్కి పోయిందన్నారు. కానీ తాను వచ్చిన తర్వాత దేశం రూపు రేఖలు మారి పోయాయని ప్రస్తుతం జి20 గ్రూప్ కు నాయకత్వం వహిస్తున్నామని అన్నారు. డిజిటల్ లావాదేవీలు వాడకంలో భారత్ టాప్ లో ఉందన్నారు.
రాష్ట్రంలో ని అత్యున్నత నాయకులలో ఒకడైన మల్లికార్జున్ ఖర్గేను గాంధీలు అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు మోదీ. కర్ణాటకను ఎలా ద్వేషిస్తున్నారో ఒకసారి ఆలోచించు కోవాలని అన్నారు మోదీ(PM Modi).
Also Read : మాయివోస్టులకు ఎమ్మెల్యే గొగోయ్ అండ