Zelenskyy : గ్రే జోన్ నుండి తొలగించండి – జెలెన్ స్కీ
పశ్చిమ దేశాలను కోరిన ప్రెసిడెంట్
Zelenskyy : ఉక్రెయిన్ పై రష్యా తన యుద్దాన్ని కొనసాగిస్తూనే ఉంది. బాంబుల మోత మోగిస్తూనే ఉంది. ఇంత చేసినా లొంగడం లేదు ఉక్రెయిన్ చీఫ్ వ్లాదిమీర్ జెలెన్ స్కీ. తాడో పేడో తేల్చుకునేంత వరకు తాను నిద్రపోనని అంటున్నాడు.
మరో వైపు అమెరికాతో పాటు బ్రిటన్ కూడా తమను తాము రక్షించు కునేందుకు ఆయుధాలు సరఫరా చేస్తామని ప్రకటించాయి. ఇంకో వైపు రష్యా ఎవరినీ బేఖాతర్ చేయడం లేదు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ సంచలన కామెంట్ చేశాడు.
గ్రే జోన్ నుండి తమ దేశాన్ని బయటకు తీసుకు రావాలని కోరారు. యూరోపియన్ యూనియన్ , రష్యా మధ్య ఇది అంతరంగా ఉందని దానిని తొలగిస్తే బాగుంటుందంటూ సూచించారు.
శుక్రవారం యూరోపియన్ యూనియన్ దేశాలకు విన్నవించారు. ఈ వారం డెన్మార్క్ రాజధాని లో జరుగుతున్న కోపెన్ హాగన్ డెమోక్రసీ సమ్మిట్ సందర్భంగా జెలెన్ స్కీ(Zelenskyy) చేసిన వీడియో ప్రసంగం ఆయా దేశాలను ,
ప్రపంచాన్ని ఆకకట్టుకుందని సమాచారం. యూరోపియన్ యూనియన్ లోకి వెళ్లేందుకు ఉక్రెయిన్ ను అనుమతించాలా వద్దా అనే సందేహం ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటికీ ఎందుకు ఉన్నారంటూ ప్రశ్నించారు. వ్లాదిమిర్ జెలెన్ స్కీ(Zelenskyy) .
ఒక రకంగా నిలదీశారు జెలెన్ స్కీ. ప్రజల మద్దతును ఎత్తి చూపారు ఈ సందర్భంగా. ప్రతి దేశం ముఖ్యమైనదని , సమానంగా గౌరవించ బడాలని యూరోపియన్ ప్రధాన విలువలు సూచిస్తున్నట్లయితే ఎందుకు తాత్సారం చేస్తున్నారంటూ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తీవ్రంగా నిలదీశారు.
Also Read : లంకకు సాయంపై భారత్ కు చైనా కితాబు