Delhi LG Saxena : జ‌ల్ బోర్డులో అవినీతిపై నివేదిక ఇవ్వండి

ఆదేశించిన విన‌య్ కుమార్ స‌క్సేనా

Delhi LG Saxena : ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీకి కోలుకోలేని షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే మ‌ద్యం పాల‌సీ స్కీంలో సీబీఐ విచార‌ణ‌కు ఆదేశించిన లెప్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ విన‌య్ కుమార్ స‌క్సేనా(Delhi LG Saxena) తాజాగా మ‌రో షాక్ ఇచ్చారు.

ఢిల్లీ జ‌ల్ బోర్డులో రూ. 20 కోట్ల అవినీతికి పాల్ప‌డిన కేసులో ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని ఆదేశించారు. ఇదిలా ఉండ‌గా ఎల్జీ ద‌ర్యాప్తును స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆప్ పేర్కొంది.

జ‌ల్ బోర్డు చైర్మ‌న్ మ‌నీష్ సిసోడియా సిఫార్సు చేసిన‌ట్లు చెప్పారు. 15 రోజుల్లోగా తీసుకున్న చ‌ర్య‌ల‌పై నివేదిక ఇవ్వాల‌ని ఎల్జీ స‌క్సేనా(Delhi LG Saxena) ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి న‌రేష్ కుమార్ ను శ‌నివారం ఆదేశించారు.

ఆప్ నేతృత్వంలోని ప్ర‌భుత్వం ఎల్జీ స‌క్సేనా మ‌ధ్య జ‌రుగుతున్న ఆధిప‌త్య పోరులో ఇది రెండో వివాదం. నీటి బిల్లుల రూపంలో రూ. 20 కోట్లు వ‌సూలు చేశార‌ని పేర్కొన్నారు.

చాలా సంవ‌త్స‌రాలుగా డీజేబీ బ్యాంకు ఖాతాకు కాకుండా ప్రైవేట్ బ్యాంకు ఖాతాకు జ‌మ చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు ఎల్జీ. నిధుల స్వాహాకు పాల్ప‌డిన డీజేబీ అధికారుల‌ను గుర్తించాల‌ని ఎల్జీ న‌వీన్ కుమార్ స‌క్సేనా ఆదేశించారు.

పూర్తిగా విచార‌ణ చేప‌ట్టి వెంట‌నే ఏం చ‌ర్య‌లు తీసుకున్నారో త‌న‌కు పూర్తి రిపోర్ట్ ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు ఎల్జీ. విచార‌ణ‌ను స్వాగ‌తిస్తున్న‌ట్లు ఆప్ తెలిపింది.

ప్ర‌స్తుతం డీజేబీ చైర్మ‌న్ మ‌నీష్ సిసోడియా మొదటిసారిగా అలాంటి విచార‌ణ‌కు సిఫార‌సు చేశార‌ని తెలిపారు. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో తమ ప్రమేయం ఏమీ లేదంటోంది ఆమ్ ఆద్మీ పార్టీ ప్ర‌భుత్వం. మొత్తంగా స‌క్సేనా వ‌ర్సెస్ కేజ్రీవాల్ గా మారింది సీన్.

Also Read : పంజాబ్ సీఎం మాన్ పై గ‌వ‌ర్న‌ర్ గుస్సా

Leave A Reply

Your Email Id will not be published!