Republic Day 2023 HC : రిపబ్లిక్ వేడుకల బాధ్యత ప్రభుత్వానిదే
స్పష్టం చేసిన రాష్ట్ర హైకోర్టు
Republic Day 2023 HC : దేశ వ్యాప్తంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్దం అవుతోంది. ఈ తరుణంలో కరోనా సాకు చూపి ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం రాజ్ భవన్ లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాజ్ భవన్ కు లేఖ పంపింది. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తమిళి సై సౌందర రాజన్.
రాజ్ భవన్ లోనే గవర్నర్ జాతీయ పతాకం ఆవిష్కరిస్తారని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్ హాజరవుతారని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. అయినా కరోనా సాకు చూపి ఎలా నిర్వహించకుండా ఉంటారని శ్రీనివాస్ అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.
దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. గణతంత్ర వేడుకలను(Republic Day 2023 HC) ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహించాలని ఆదేశించింది. అది ఎక్కడ అనేది ప్రభుత్వ నిర్ణయమని కానీ రాజ్ భవన్ లో మాత్రం కాదని పేర్కొంది. ప్రస్తుతం రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారి పోయింది.
గత కొంత కాలం నుంచి సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. చివరకు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ బహిరంగంగానే గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
రిపబ్లిక వేడుకల నిర్వహణకు సంబంధించి హైకోర్టు జోక్యం చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గణతంత్ర వేడుకల నిర్వహణపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఏజీ చెప్పిన వాటిని పట్టించు కోలేదు కోర్టు.
Also Read : పేరెంట్స్ ఆశీర్వాదం యాత్రకు సిద్దం
