Tamilisai Republic Day Celebrations : రాజ్ భవన్ లోనే గణతంత్ర వేడుకలు
తెలంగాణ గవర్నర్ కార్యాలయం వెల్లడి
Tamilisai Republic Day Celebrations : గణతంత్ర వేడుకలు ఎక్కడ నిర్వహించాలనే దానిపై కీలకమైన ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. దాఖలైన పిటిషన్ పై పరేడ్ గ్రౌండ్స్ లో కానీ లేదా ఇతర ఏప్రాంతం లోనైనా రిపబ్లిక్ వేడుకలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. శ్రీనివాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.
రాష్ట్రంలో రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ గా మారి పోయింది. గత కొంత కాలం నుంచి సీఎం కేసీఆర్ వర్సెస్ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కు మధ్య పొసగడం లేదు. ఒక్క తెలంగాణలోనే కాదు దేశంలోని బీజేపీయేతర రాష్ట్రాలలో సేమ్ సీన్ కొనసాగుతోంది. ఈ తరుణంలో రిపబ్లిక్ వేడుకలు ఎక్కడ నిర్వహిస్తారనే దానిపై పూర్తి క్లారిటీ ఇచ్చింది సర్కార్.
ఈనెల 21న రాజ్ భవన్ కార్యాలయానికి నోట్ పంపించింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీఐజీ అంజనీ కుమార్ హాజరవుతారని, గవర్నర్ తమిళి సై జాతీయ జెండా ఎగుర వేస్తారని స్పష్టం చేసింది. దీనిపై గవర్నర్ తమిళి సై(Tamilisai Republic Day Celebrations) అసంతృప్తి వ్యక్తం చేసింది.
ప్రతి ఏటా రిపబ్లిక్ డేను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తూ వచ్చారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా రాజ్ భవన్ లోనే జెండా ఎగుర వేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా తగ్గు ముఖం పట్టడంతో ఈసారైనా పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర వేడుకలు నిర్వహిస్తారని అనుకున్నారు. కానీ సర్కార్ చావు కబురు చల్లగా చెప్పింది. చివరకు హైకోర్టు ఆదేశించడంతో దానికి ముగింపు పలికారు గవర్నర్ . తాను రాజ్ భవన్ లోనే జెండా ఎగుర వేస్తానని తెలిపింది.
Also Read : సమున్నత భారతం గణతంత్ర దినోత్సవం