Congress Chief Poll : రాహుల్ కాంగ్రెస్ చీఫ్ కావాలంటూ తీర్మానం
నిన్న గుజరాత్ , చత్తీస్ గఢ్ ఇవాళ తమిళనాడు, బీహార్
Congress Chief Poll : దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చీఫ్ ఎవరు అవుతారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గాంధీ ఫ్యామిలీనా లేక గాంధీయేతర నాయకులలో ఎవరు అధ్యక్షుడు అవుతారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి.
వచ్చే అక్టోబర్ 17న పార్టీ చీఫ్ కోసం ఎన్నిక జరగనుంది(Congress Chief Poll). మొత్తం 9,000 మంది ఓటింగ్ లో పాల్గొంటారు. అక్టోబర్ 19న ఎన్నికల ఫలితం ప్రకటిస్తారు.
ఈ తరుణంలో పార్టీ పరంగా రాహుల్ గాంధీనే పార్టీ అధ్యక్షుడు కావాలంటూ పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు కోరుతున్నారు. పనిలో పనిగా ఆయా రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీల యూనిట్లు ఏకగ్రీవంగా తీర్మానం చేస్తున్నాయి.
నిన్న అశోక్ గెహ్లాట్ నేతృత్వంలో రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ , చత్తీస్ గడ్ సీఎం భూపేష్ బఘేల్ నేతృత్వంలోని రాష్ట్ర పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి. ఈ తీర్మానాలను హై కమాండ్ కు పంపించాయి.
వీటితో పాటు సోమవారం మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ, బీహార్ రాష్ట్ర పార్టీలు కూడా రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నిక కావాలంటూ తీర్మానం చేశాయి.
ఇవాళ ఉదయం జరిగిన టీఎన్సీసీ జనరల్ కౌన్సిల్ లో తీర్మానం ఆమోదించారు. సెప్టెంబర్ 22న కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
ఈనెల 24 నుండి సెప్టెంబర్ 30 దాకా నామినేషన్లు దాఖలు చేయవచ్చు. నామినేషన్ దాఖలుకు చివరి రోజు సెప్టెంబర్ 30. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8. అయితే రాహుల్ గాంధీ పోటీ చేస్తారా చేయరా అన్న దానిపై అనుమానం నెలకొంది.
Also Read : సోనియా గాంధీని కలిసిన శశి థరూర్