Joe Biden Putin : యావత్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురు చూస్తున్న నిర్ణయాన్ని ప్రకటించింది అమెరికా. ఉక్రెయిన్ పై ఏకపక్షంగా దాడులకు తెగబడుతూ చెలరేగుతున్న రష్యాపై మరిన్ని ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా దేశ అధ్యక్షుడు జోసెఫ్ బైడెన్(Joe Biden Putin) కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు రష్యా నుంచి గ్యాస్, ఆయిల్ దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. ఆయన ఇవాళ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసేందుకు అమెరికా చర్యలు తీసుకుంటోందన్నారు.
పుతిన్ రక్తం మరిగిన పులి అని సంచలన ఆరోపణలు చేశాడు బైడెన్. పోలండ్, ఉక్రెయిన్ పరిస్థితులపై సమీక్షిస్తున్నామని చెప్పారు. ఉక్రెయిన్ కు అండగా ఉంటామని మరోసారి స్పష్టం చేశారు అమెరికా ప్రెసిడెంట్.
ఎవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించినా తమ సాయం కంటిన్యూగా కొనసాగుతుందన్నారు. యుద్దంలో భాగంగా రష్యాను ఎదుర్కొనేందుకు ఆ దేశానికి ఆయుధాలు ఇస్తామని మరోసారి ప్రకటించారు బైడెన్(Joe Biden Putin).
ఇదిలా ఉండగా తమపై ఆర్థిక ఆంక్షలు విధించడం అంటే తమపై పరోక్షంగా యుద్దం ప్రకటించినట్లేనని సంచలన వ్యాఖ్యలు చేశారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్.
ఇదే సమయంలో నాటో దళాలు తనకు అవసరం లేదన్నాడు మరో వైపు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ప్రస్తుతం అమెరికా చీఫ్ చేసిన ప్రకటన కారణంగా ఆయిల్ ధరలపై మరింత భారం పెరిగే అవకాశం ఉంది.
బైడెన్ అనాలోచిత నిర్ణయం మరింత యుద్దాన్ని ప్రేరేపించేదిగా ఉందని ఇతర దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికైనా రష్యాతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించాలని కోరుతున్నాయి.
Also Read : ఇమ్రాన్ ఖాన్ కు డెడ్ లైన్