Bhumireddy Ram Gopal Reddy : ఎట్టకేలకు ఎమ్మెల్సీకి అందజేత
అనంతపురం జిల్లాలో హైటెన్షన్
Bhumireddy Ram Gopal Reddy : ఏపీలో రాజకీయాలు మరింత ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. సమీకరణలు కూడా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు గెలుపొందగా గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన మూడింట్లో కూడా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. వీటిలో ఒకటి ఉత్తరాంధ్ర కాగా రెండు రాయలసీమలో ఉన్నాయి.
పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పులివెందులకు చెందిన భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి ఘన విజయాన్ని సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి అధికార వైసీపీకి చెందిన అభ్యర్థి పై 7, 500 ఓట్లకు పైగా తేడాతో గ్రాండ్ విక్టరీని నమోదు చేశారు. ఇదిలా ఉండగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. అర్ధరాత్రి వరకు హై డ్రామా చోటు చేసుకుంది.
భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి(Bhumireddy Ram Gopal Reddy) గెలుపొందారని ప్రకటించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. కానీ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకుండా వెళ్లి పోయారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు టీడీపీ అభ్యర్థితో పాటు మాజీ మంత్రులు, నాయకులు. కలెక్టర్ వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో వారందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతపురం కలెక్టరేట్ వద్ద హై టెన్షన్ నెలకొంది. రామ గోపాల్ రెడ్డిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పరిటాల సునీత, కాల్వ శ్రీనివాసులు, పరిటాల శ్రీరామ్ , ప్రభాకర్ చౌదరి నిరసన తెలిపారు. దీంతో ఎట్టకేలకు పోలీసులు దిగి వచ్చారు.
రామ గోపాల్ రెడ్డిని విడుదల చేశారు. అనంతరం ఆయనకు ఎమ్మెల్సీగా గెలిచినట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ ఫామ్ అందజేశారు.
Also Read : అద్భుత విజయం బాబు ఉత్సాహం