Marri Shashidhar Reddy : రేవంత్ బ్లాక్ మెయిల‌ర్ – శ‌శిధ‌ర్ రెడ్డి

బాధ తోనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నా

Marri Shashidhar Reddy : గ‌త్యంత‌రం లేక‌నే తాను కాంగ్రెస్ పార్టీని వీడాల్సి వ‌చ్చింద‌న్నారు ఆ పార్టీకి గుడ్ బై చెప్పిన మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. సంచ‌ల‌న కామెంట్స్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై. పార్టీలో తాను అత్యంత సీనియ‌ర్ నాయ‌కుడిన‌ని అన్నారు. ప్ర‌జాస్వామ్యం లేకుండా పోయింద‌న్నారు.

పెద్ద‌లు, సీనియ‌ర్ల‌కు విలుల లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. పార్టీని ఎలా న‌డ‌పాలో తెలియ‌ని వ్య‌క్తికి ప‌గ్గాలు ఇస్తే ఎలా అని ప్ర‌శ్నించారు. ఎన్నోసార్లు హైక‌మాండ్ తో చెప్పే ప్ర‌య‌త్నం చేశాన‌ని కానీ ప‌ట్టించు కోలేద‌న్నారు మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి(Marri Shashidhar Reddy).

ఇదే స‌మ‌యంలో టీపీసీసీ చీఫ్ గా ఎప్పుడైతే రేవంత్ రెడ్డి వ‌చ్చాడో ఆనాటి నుంచి పార్టీకి భ‌విష్య‌త్తు లేకుండా పోయింద‌న్నారు. కాగా పార్టీ ప‌రంగా త‌న‌కు మంచి గుర్తింపు ల‌భించింద‌న్నారు. పార్టీని వీడ‌డం ఇష్టం లేకున్నా గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో రాజీనామా చేయాల్సి వ‌చ్చింద‌న్నారు శ‌శిధ‌ర్ రెడ్డి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీ బి – టీమ్ గా మారి పోయింద‌ని ఆరోపించారు. ప్ర‌జలు ఓ వైపు స‌మ‌స్య‌లతో త‌ల్ల‌డిల్లుతుంటే వాటి కోసం పోరాటం చేయ‌కుండా వ్య‌క్తిగ‌త ఇమేజ్ పెంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ మ‌ర్రి మండిప‌డ్డారు.

తాను ఎందుకు రాజీనామా చేయాల్సి వ‌చ్చిందోన‌నే విష‌యంపై సుదీర్ఘ‌మైన లేఖ సోనియా గాంధీకి రాశాన‌ని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభ‌వాన్ని తీసుకు రావ‌డమే కాదు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకు వ‌చ్చిన ఘ‌న‌త త‌న తండ్రి మ‌ర్రి చెన్నారెడ్డికి ద‌క్కుతుంద‌న్నారు.

ఉత్త‌మ్ కుమార్ రెడ్డి వ‌చ్చాక మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డారంటూ ఆరోపించారు. రేవంత్ రెడ్డి అతి పెద్ద బ్లాక్ మెయిల‌ర్ అంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మాణిక్యం ఠాగోర్ ఓ ద్రోహి అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

Also Read : మంత్రి మ‌ల్లారెడ్డికి ఐటీ బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!