Revanth Reddy CM : హోటల్ లోనే రేవంత్ రెడ్డి మకాం
నో కామెంట్ జస్ట్ కూల్ అన్న పీసీసీ చీఫ్
Revanth Reddy : హైదరాబాద్ – ఎట్టకేలకు తెలంగాణ సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఏఐసీసీ కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశం ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగింది. ఈ మీటింగ్ కు ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగో పాల్ హాజరయ్యారు.
Revanth Reddy Maybe CM
వీరితో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ , మాణిక్ రావు ఠాక్రే పాల్గొన్నారు. ఇదిలా ఉండగా 48 గంటలుగా ఎల్లా హోటల్ లోనే మకాం వేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఆయన స్వస్థలం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వారు. ఆయనది కల్వకుర్తి నియోజకవర్గం. దివంగత కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డికి దూరపు బంధువు.
ఆయన ప్రస్థానం ఇండిపెండెంట్ గా జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీగా గెలుపొందారు. టీడీపీలో చేరారు. కోడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీఆర్ఎస్ చేతిలో ఓడి పోయారు. అక్కడి నుంచి ఎంపీగా గెలుపొందారు. టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఓ వైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు భట్టి విక్రమార్క సైతం సీఎం రేసులో ఉన్నా చివరకు హై కమాండ్ రేవంత్ రెడ్డి వైపు మొగ్గింది. ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డిని కలిసేందుకు క్యూ కట్టారు.
Also Read : Revanth Reddy : తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి..?
