Revanth Reddy : ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి
సోనియా..రాహుల్..ప్రియాంకకు థ్యాంక్స్
Revanth Reddy : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమటీ (టీపీసీసీ) చీఫ్ గా రేవంత్ రెడ్డి(Revanth Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా కొలువు తీరి ఇవాల్టితో ఏడాది పూర్తయింది.
సరిగ్గా 7 జూలై 2021న గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతోషాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి పెద్ద బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక చీఫ్ సోనియా గాంధీ, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ,
ఇన్ చార్జ్ కేసీ వేణుగోపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి.
కొంత కాలం స్తబ్దుగా ఉన్న పార్టీలో కొత్త కళ వచ్చింది. ఆయన ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ఆపై సీఎం కేసీఆర్, కొడుకు కేటీఆర్, తనయ కవిత, అల్లుడు హరీష్ రావు, మేనల్లుడు సంతోష్ రావులను ఏకి పారేస్తున్నారు.
ప్రజా సమస్యలపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ధర్నాలు, ఆందోళనలు చేపట్టేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. రైతులకు సంబంధించి పోరుగల్లు వేదికగా రైతు డిక్లరేషన్ ప్రకటించేలా చేశారు.
ప్రభుత్వం తీసుకు వచ్చిన ధరణి పోర్టల్ లో చోటు చేసుకున్న లోపాలను ఎత్తి చూపారు. ఆపై ధరణి రచ్చబండ పేరుతో నిప్పులు చెరిగారు సర్కార్ పై.
మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకు వెళ్లడంలో కొంత మేరకు సక్సెస్ అయ్యాడని చెప్పక తప్పదు.
Also Read : ‘ధరణి’ కోసం మరో సాయుధ పోరాటం