Revanth Reddy Contest : రెండు చోట్ల రేవంత్ రెడ్డి పోటీ
కామారెడ్డి..కోడంగల్ లో బరిలోకి
Revanth Reddy Contest : తెలంగాణ -రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 119 స్థానాలకు గాను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని రెండు చోట్ల పోటీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రేవంత్ రెడ్డి కోడంగల్ నియోజకవర్గంతో పాటు బీఆర్ఎస్ బాస్, సీఎం కేసీఆర్ పోటీ చేసే కామారెడ్డి నియోజకవర్గంలో కూడా బరిలో ఉండనున్నారు.
Revanth Reddy Contest Updates
ఇదే విషయాన్ని ధ్రువీకరించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దీంతో ఈనెల 6న కోడంగల్ లో , 8న కామా రెడ్డిలో రేవంత్ రెడ్డి(Revanth Reddy Contest) నామినేషన్లు దాఖలు చేయనున్నారు. అంతే కాకుండా మాజీ మంత్రి షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉండనున్నారు. ఇదే విషయాన్ని ఎన్నికల కమిటీ స్పష్టం చేసింది. కాగా ఆయన నామినేషన్ వేసే తేదీని ఇంకా ఖరారు చేయలేదు.
ఇదిలా ఉండగా రేవంత్ రెడ్డి కామారెడ్డిలో పోటీ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గతంలో కంటే ఈసారి సీఎం కేసీఆర్ కు గట్టి పోటీ ఎదురు కానుంది. గజ్వేల్ లో మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ బరిలో ఉండగా కామారెడ్డిలో కేసీఆర్ కు ధీటుగా రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఎవరు గెలుస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Also Read : Rakesh Reddy : గులాబీ గూటికి రాకేశ్ రెడ్డి