Revanth Reddy : చంద్రబాబు వల్ల హైటెక్ సిటీ రాలేదు
కంప్యూటర్ ను పరిచయం చేసింది రాజీవ్
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. నిన్నటి దాకా చంద్రబాబు పాట పాడిన రేవంత్(Revanth Reddy) ఉన్నట్టుండి స్వరం మార్చారు. ప్రజలు ఓటు వేసే ముందు ఇబ్బంది కలుగుతుందేమోనని భావించారు. అందుకే హైటెక్ సిటీని పదే పదే తాను నిర్మించానంటూ గొప్పలు చెప్పే చంద్రబాబు నాయుడుకు షాక్ ఇచ్చారు.
Revanth Reddy Comments Viral
ఆ హైటెక్ సిటీకి పునాది రాయి వేసింది కాంగ్రెస్ పార్టీకి చెందిన దివంగత సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు కాదన్నారు. ఇక ఈ దేశానికి టెక్నాలజీని, ముఖ్యంగా కంప్యూటర్ ను ఈ దేశానికి పరిచయం చేసిన ఘనత ఆనాటి దివంగత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకే దక్కుతుందన్నారు.
ఇవాళ తానేదో సాధించినట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గొప్పలు పోతున్నాడని ఆయనకు అంత సీన్ లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే ఈ దేశానికి టెలికమ్యూనిషేన్స్ పరంగా, కంప్యూటర్ పరంగా, టెక్నాలజీ పరంగా ఎంతో కొంత మేలు జరిగిందంటే కేవలం అది కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ రావడం ఖాయమని, ఇక కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లడం బరా బర్ అని ప్రకటించారు.
Also Read : CPM List : 14 మందితో సీపీఎం తొలి జాబితా