Revanth Reddy : ప్ర‌మాణ స్వీకారం ప్ర‌ముఖుల‌కు ఆహ్వానం

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా వెల్ క‌మ్

Revanth Reddy : హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా కొలువు తీరిన రేవంత్ రెడ్డి డిసెంబ‌ర్ 7న గురువారం స‌రిగ్గా మ‌ధ్యాహ్నం 1.42 నిమిషాల‌కు ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీ మేర‌కు ఆరు గ్యారెంటీల‌కు సంబంధించి ఏదో ఒక హామీపై సంత‌కం చేయ‌నున్నారు. ఇక ఏర్పాట్ల‌ను ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తున్నారు సీఎస్ శాంతి కుమారి.

Revanth Reddy Invitation

ఇప్ప‌టికే ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి ప్ర‌ముఖుల‌ను క‌లిసి రావాల‌ని కోరుతున్నారు. ప్ర‌మాణ స్వీకారోత్స‌వం న‌గ‌రంలోని ఎల్బీ స్టేడియంలో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టి దాకా ఆహ్వానాలు అందుకున్న వారిలో మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక‌, కేసీ వేణుగోపాల్ , సీఎం సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం శివ‌కుమార్, అశోక్ చౌహాన్, భూపేష్ బ‌ఘేల్ , ఎంకే స్టాలిన్, పి. చిదంబ‌రం, మీరా కుమారి, దిగ్విజ‌య్ సింగ్, వీర‌ప్ప మొయిలీ, ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, అశోక్ గెహ్లాట్, మాజీ సీఎం కేసీఆర్ , టీడీపీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ఉన్నారు.

వీరితో పాటు తెలంగాణ జ‌న స‌మితి పార్టీ చీఫ్ ప్రొఫెస‌ర్ కోదండ‌రామ్ , ప్రొఫెస‌ర్ హ‌ర గోపాల్ , ప్ర‌ముఖ సంపాద‌కుడు కె. రామ‌చంద్ర‌మూర్తి, ఉద్య‌మ‌కారుడు గాదె ఇన్న‌య్య‌, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్ , అమ‌ర వీరుల కుటుంబాలు, వివిధ కుల సంఘాల నాయ‌కులు, మేధావుల‌కు ఆహ్వానం ప‌లికారు. ఇదే స‌మ‌యంలో తాను హామీ ఇచ్చిన విధంగానే దివ్యాంగురాలు ర‌జ‌నీకి ఉద్యోగం ఇచ్చే ప‌త్రంపై సంత‌కం చేయ‌నున్నారు రేవంత్ రెడ్డి.

Also Read : Revanth Reddy Rahul : రాహుల్..ప్రియాంక‌కు వెల్ క‌మ్

Leave A Reply

Your Email Id will not be published!