Dasoju Sravan : రేవంత్ బీజేపీ కోవర్ట్ – శ్రవణ్
అది నోరా మోరీనా అంటూ ఫైర్
Dasoju Sravan : బీఆర్ఎస్ జాతీయ నేత దాసోజు శ్రవణ్ నిప్పులు చెరిగారు. ఆయన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరుల మీద బురద చల్లడం పనిగా పెట్టుకున్నాడంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ కాదని బీజేపీకి కోవర్ట్ అంటూ మండిపడ్డారు.
చిల్లర మాటలకు పెట్టింది పేరంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ సారథ్యంలో జరుగుతున్న అభివృద్ది కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఓర్వ లేకనే అవాకులు చెవాకులు పేలుతున్నాడంటూ ధ్వజమెత్తారు శ్రవణ్(Dasoju Sravan).
కేటీఆర్ రాష్ట్ర అభివృద్దికి సంబంధించి కేంద్ర మంత్రులను కలిశాడని, దానిని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. నువ్వు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసింది మరిచి పోయావా అంటూ ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోను కూడా ఆయన చూపించారు మీడియాకు.
ప్రతిపక్ష నాయకుడిగా ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సిన రేవంత్ రెడ్డి గతి తప్పి మతి తప్పి మాట్లాడుతున్నాడంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వెళ్లినా దానిని కూడా రాజకీయం చేయాలని అనుకోవడం దారుణమన్నారు శ్రవణ్.
ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. కర్ణాటకలో గెలుపొందిన సీఎం సిద్దరామయ్య, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖు, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ బఘేల్ ప్రధాన మంత్రి మోదీని, కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాను కలిశారని ఆ మాత్రం రేవంత్ కు తెలియదా అని అన్నారు. వారంతా తమపై ఉన్న కేసులు ఎత్తి వేయాలని కోరేందుకు వెళ్లారా అని నిలదీశారు శ్రవణ్.
Also Read : JP Nadda Nageshwar : నాగేశ్వర్ తో జేపీ నడ్డా భేటీ